Site icon NTV Telugu

ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ.. A+ గ్రేడ్ 4K QLED ప్యానెల్ తో Vu Vibe Series 4K QLED Smart Google టీవీపై 46% తగ్గింపు..!

Vu Tv

Vu Tv

Vu Vibe Series 4K QLED Smart Google TV: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్‌లో ప్రస్తుతం ఓ భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. Vu 139cm (55 అంగుళాలు) Vibe Series 4K QLED Smart Google TV (Model: 55VIBE-DV) భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ధర శ్రేణిలో ప్రీమియం ఫీచర్లను అందించడం వల్ల ఈ టీవీ కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ టీవీ డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో A+ గ్రేడ్ 4K QLED ప్యానెల్ ఉపయోగించారు.

దీని వల్ల స్పష్టమైన విజువల్స్‌తో పాటు రిచ్ కలర్స్ కనిపిస్తాయి. 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, Dolby Vision, HDR10, HLG సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేటప్పుడు థియేటర్‌లాంటి అనుభూతి లభిస్తుంది. సౌండ్ పరంగా ఈ టీవీ ప్రధానంగా ప్రత్యేకతను చూపిస్తుంది. ఇందులో ఉన్న 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ సాధారణ టీవీలతో పోలిస్తే చాలా ఎక్కువ ఆడియో అవుట్‌పుట్ ఇస్తుంది. డాల్బీ ఆటమ్స్, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఉండటం వల్ల అదనంగా హోమ్ థియేటర్ అవసరం లేకుండానే మంచి సౌండ్ అనుభవం పొందవచ్చు.

Gang R*ape: సమాజం ఎటుపోతోంది..? 13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్.. కస్టడీలో నిందితులు

పనితీరు, స్మార్ట్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ టీవీ ‘గూగుల్ టీవీ’ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఇందులో 1.5GHz VuOn™ ప్రాసెసర్, 2GB RAM, 16GB స్టోరేజ్ ఇవ్వడం వల్ల యాప్‌లు స్మూత్‌గా రన్ అవుతాయి. నెట్ఫ్లిక్, యూట్యూబ్ వంటి హాట్‌కీస్‌తో కూడిన యాక్టివాయిస్ రిమోట్, గూగుల్ అసిస్టెంట్, ఆపిల్ ఎయిర్ ప్లే, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi (5GHz), బ్లూటూత్ 5.3 వంటి ఆధునిక ఫీచర్లు వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తాయి.

గేమింగ్ ప్రేమికులకు కూడా ఈ టీవీ మంచి ఎంపికగా నిలుస్తుంది. ఇందులో HDMI 2.1, VRR, ALLM, HDR గేమింగ్, గేమ్ మోడ్, గేమ్ డాష్ బోర్డు వంటి ఫీచర్లు ఉండటం వల్ల కన్సోల్ గేమింగ్ అనుభవం మరింత మెరుగవుతుంది. అలాగే 2 USB పోర్ట్స్, HDMI, ఈథర్నెట్, బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ధర విషయానికి వస్తే.. Vu 139cm (55 అంగుళాలు) Vibe Series 4K QLED Smart Google TV (Model: 55VIBE-DV) అసలు ధర రూ.60,000 కాగా.. భారీ 46% డిస్కౌంట్‌తో రూ.32,490కే లభిస్తోంది.

Crime News: ఛీ.. ఛీ.. ఇంత క్రూరంగా ఎలా..? 82 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. చివరకు..?

ఈ టీవీకి రూ.1,142 నుంచి EMI ప్రారంభమవుతుంది. అలాగే No Cost EMI ఆప్షన్, బ్యాంక్ కార్డులపై రూ.1,500 వరకు డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీసీఐ కార్డుతో క్యాష్‌బ్యాక్ ఆఫర్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ టీవీకి 4K QLED A+ గ్రేడ్ డిస్‌ప్లే, 88W పవర్‌ఫుల్ సౌండ్‌బార్, Dolby Vision & Dolby Atmos, Google TV, HDMI 2.1 గేమింగ్ ఫీచర్లు వంటి అనేక ప్లస్ పాయింట్లు ఉన్నాయి.

Exit mobile version