Site icon NTV Telugu

VuOn AI ప్రాసెసర్, 88W ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ ఉన్న Vu 43 inches Vibe Series 4K QLED Smart Google TVపై భారీ డిస్కౌంట్..!

Vu 43 Inches Vibe Series 4k Qled Smart Google Tv

Vu 43 Inches Vibe Series 4k Qled Smart Google Tv

Vu 43 inches Vibe Series 4K QLED Smart Google TV: Vu కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన Vu 108cm (43 అంగుళాలు) వైబ్ సిరీస్ 4K QLED స్మార్ట్ గూగుల్ టీవీ (43VIBE-DV) అద్భుతమైన వినోద అనుభవాన్ని అందిస్తోంది. శక్తివంతమైన ఆడియో, అధునాతన పిక్చర్ టెక్నాలజీ, సరికొత్త స్మార్ట్ ఫీచర్స్‌తో ఈ టీవీ మీ ఇంటికి ఒక ప్రీమియం హంగును తెస్తుంది. 43 అంగుళాల ఈ టీవీలో 4K అల్ట్రా HD QLED డిస్‌ప్లే ఉంది. QLED (క్వాంటమ్ డాట్ LED) సాంకేతికత కారణంగా రంగులు చాలా ప్రకాశవంతంగా, సహజంగా కనిపిస్తాయి. సినిమా ప్రియుల కోసం ఇందులో ప్రత్యేకంగా డాల్బీ విజన్ (Dolby Vision), HDR10, HLG వంటి హై డైనమిక్ రేంజ్ (HDR) ఫార్మాట్‌లకు మద్దతు ఉంది. 400 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండడంతో ఇది ప్రకాశవంతమైన గదులలో కూడా స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుంది. అలాగే వేగంగా కదిలే సన్నివేశాలను మరింత సున్నితంగా, బ్లర్ లేకుండా చూపించడానికి MEMC టెక్నాలజీ సహాయపడుతుంది. అలాగే ఇందులోని టీవీలోని VuOn™ AI ప్రాసెసర్ కంటెంట్‌ను విశ్లేషించి దాని నాణ్యతను ఆటోమెటిక్‌గా మెరుగుపరుస్తుంది.

Montha Cyclone Damage: సీఎంతో కేంద్ర బృందం భేటీ.. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలంటూ..

ఈ టీవీ అతిపెద్ద ఆకర్షణ ఇందులోని 88 వాట్స్ (88W) శక్తివంతమైన ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్. ప్రత్యేకంగా బాహ్య స్పీకర్లు (External Speakers) అవసరం లేకుండానే థియేటర్ స్థాయి ధ్వని అనుభవాన్ని ఈ టీవీ అందిస్తుంది. ఇందులోని డాల్బీ అట్మాస్ (Dolby Atmos) త్రీ-డైమెన్షనల్ (3D) సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనితో మీ చుట్టూ ధ్వని కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఈ సౌండ్‌బార్ స్పష్టమైన సంభాషణలు, శక్తివంతమైన బాస్‌ను అందించడానికి రూపొందించబడింది. ఇక ఇందులోని ఆడియో ఓన్లీ మోడ్ ద్వారా స్క్రీన్‌ను ఆఫ్ చేసి కేవలం మ్యూజిక్ ప్లే చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. గూగుల్ టీవీ (Google TV) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ టీవీ మీకు ఇష్టమైన అన్ని స్ట్రీమింగ్ యాప్‌లను (Netflix, Prime Video, YouTube, Disney+ Hotstar etc.) ఒకే చోట అందిస్తుంది. ఇక టీవిలో వేగవంతమైన పనితీరు కోసం 1.5GHz VuOn™ AI ప్రాసెసర్‌, 2GB RAM, 16GB స్టోరేజ్‌ను ఇందులో పొందుపరిచారు. అలాగే రిమోట్‌లోని యాక్టివాయిస్ రిమోట్ కంట్రోల్ సహాయంతో గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగించి వాయిస్ ద్వారా కంటెంట్‌ను వెతకవచ్చు.

ISSF World Championships: చరిత్ర సష్టించిన సామ్రాట్ రాణా.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం కైవసం..!

ఇక ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ ఇండియాలో ప్రస్తుతం 42% డిస్కౌంట్ లభించడంతో 40,000 విలువైన టీవీ కేవలం రూ. 23,190 ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఎస్ బ్యాంక్, IDFC ఫస్ట్, HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికీ అదనంగా రూ. 1,500 రూపాయల ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 21,690కే సొంతం చేసుకోవచ్చు.

Exit mobile version