vivo Y500 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (vivo) కొత్త Y సిరీస్ ఫోన్ చైనాలో vivo Y500 Pro ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇది గత ఏడాది విడుదలైన vivo Y300 Proకు సక్సెసర్‌గా వచ్చింది. కొత్త మోడల్‌లో డిస్‌ప్లే, కెమెరా, పనితీరు, బ్యాటరీ లైఫ్ వంటి విభాగాల్లో గణనీయమైన అప్‌గ్రేడ్స్ అందించబడ్డాయి. ఈ కొత్త vivo Y500 Proలో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా ఇది సన్నగా, ఆధునికంగా ఉండి IP68 + IP69 రేటింగ్స్ తో డస్ట్, వాటర్‌ప్రూఫ్ ఫీచర్లు కలిగి ఉంది. కంపెనీ ప్రకారం 2000 చిన్న డ్రాప్స్ తరువాత కూడా IP68 రక్షణ కొనసాగుతుందని చెబుతోంది.
Jubilee Hills Bypol Exitpolls : జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపు అంటున్న ఎగ్జిట్ పోల్స్
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 (4nm) ప్రాసెసర్ ఉంది. మొబైల్ గరిష్ఠంగా 12GB ర్యామ్, 512GB UFS 2.2 స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6తో రన్ అవుతుంది. ఫోటోగ్రఫీ విభాగంలో vivo Y500 Proలో 200MP ప్రైమరీ కెమెరా (Samsung HP5 సెన్సార్, f/1.88 aperture) ఉంది. దీనికి తోడు 2MP డెప్త్ సెన్సార్, ఆరా లైట్ ఫీచర్ కూడా ఉంది. ఫ్రంట్‌లో 32MP సెల్ఫీ కెమెరా (f/2.45 aperture) అందించబడింది. ఇది ఫోటోలు, వీడియోలు తీసే వారికి ప్రొఫెషనల్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ లో మరో ప్రధాన ఆకర్షణ 7000mAh బ్లూ ఓషన్ బ్యాటరీ. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఎక్కువ సేపు బ్యాటరీ లైఫ్‌తో పాటు వేగవంతమైన ఛార్జింగ్ సౌకర్యం లభిస్తుంది.
100 అంగుళాల QLED స్క్రీన్, 60W స్పీకర్లతో భారత మార్కెట్లో Acerpure Nitro Z Series టీవీ లాంచ్..!
వీటితో పాటు vivo Y500 Proలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, USB టైపు-C ఆడియో, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ 198.6 గ్రాములు, మందం కేవలం 7.81 మి.మీ. మాత్రమే. ఈ vivo Y500 Pro స్మార్ట్‌ఫోన్ ఆస్పిషియస్ గోల్డ్ (Auspicious Gold), లైట్ గ్రీన్ (Light Green), సాఫ్ట్ పింక్ (Soft Pink), టైటానియం బ్లాక్ (Titanium Black) వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. ఈ మోడల్ నాలుగు విభిన్న వేరియంట్‌లలో లభిస్తుంది. వాటి ధరలు, స్టోరేజీ వివరాలు చూస్తే.. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర ¥1799 (రూ.22,420), 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ¥1999 (రూ.24,910), 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర ¥2299 (రూ.28,650), 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర ¥2599 (రూ.32,390)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌కి అందుబాటులో ఉంది. ఇక నవంబర్ 14 నుండి చైనాలో అధికారికంగా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
