Site icon NTV Telugu

400% వాల్యూమ్ బూస్ట్, IP68+IP69 రక్షణ, 120Hz డిస్‌ప్లేతో బడ్జెట్ లో Vivo Y31d లాంచ్.. ధర ఎంతంటే.?

Vivo Y31d Launched

Vivo Y31d Launched

Vivo Y31d Launched: వివో (vivo) తన Y-సిరీస్ లైనప్‌ను సైలెంట్ గా విస్తరిస్తూ కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y31dను మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారీ బ్యాటరీ, బలమైన వాటర్ రెసిస్టెన్స్, స్మూత్ డిస్‌ప్లే వంటి అంశాలతో ఇది బడ్జెట్, మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో బెస్ట్ ఛాయస్ గా కనిపిస్తోంది.

Vivo Y31dలోని ప్రధాన హైలైట్ 7,200mAh భారీ బ్యాటరీ. ఇందులో వివో బ్లూవోల్ట్ (BlueVolt) బ్యాటరీ టెక్నాలజీను ఉపయోగించారు. ఇది బ్యాటరీ లైఫ్‌ను ఎక్కువ సేపు నిలుపుతుందని కంపెనీ చెబుతోంది. ఈ బ్యాటరీ 13 గంటలకు పైగా ఆన్‌లైన్ గేమింగ్, 14 గంటల నావిగేషన్, 45 గంటల వీడియో ప్లేబ్యాక్ ఇవ్వగలదని కంపెనీ చెబుతోంది. అలాగే ఫోన్ 44W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 1-50% వరకు చార్జ్ కావడానికి 43 నిమిషాలే పడుతుందని కంపెనీ చెబుతోంది. గేమింగ్ సమయంలో హీట్ తగ్గించేందుకు బైపాస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. బ్యాటరీ హెల్త్ ఆరు సంవత్సరాల వరకు నిలిచేలా డిజైన్ చేశారు.

Champion: సడెన్‌గా OTT ఎంట్రీ ఇచ్చిన.. యంగ్ హీరో మూవీ

Vivo Y31d బ్యాటరీతోనే కాకుండా రక్షణలోనూ ముందుంది. ఈ ఫోన్‌కు IP68+IP69 రేటింగ్లు ఉన్నాయి. అంటే దుమ్ము, వర్షం మాత్రమే కాదు.. హై ప్రెషర్ వాటర్ జెట్స్‌ను కూడా తట్టుకోగలదు. అలాగే 1.5 మీటర్ల లోతులో 30 ని.ల వరకు నీటిలో ఉన్నా ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. ఫోన్ బాడీకి ప్లాస్టిక్ ఫ్రేమ్, బ్యాక్ ఉపయోగించగా.. కెమెరా మాడ్యూల్ మెటల్‌తో తయారు చేశారు. మొబైల్ బరువు 219 గ్రాములు కాగా.. ఇది గ్లో వైట్, స్టార్ లైట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, యానిమేషన్లు చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. హై బ్రైట్‌నెస్ మోడ్‌లో స్క్రీన్ 1,250 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుంది. దీంతో బయట వెలుతురులో కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. రిజల్యూషన్ HD+ (720 × 1570 పిక్సెల్స్) అయినప్పటికీ, రోజువారీ వీడియోలు, బ్రౌజింగ్, సోషల్ మీడియా వాడకానికి ఇది బాగా సరిపోతుంది.

Gold Rate Today: బంగారంపై 12 వేలు, వెండిపై 30 వేలు.. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరిన ధరలు!

అయితే ఇందులో కెమెరా సెటప్ సింపుల్‌గా ఉందని చెప్పవచ్చు. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా+2MP సెకండరీ సెన్సర్ ఉన్నాయి. HDR, పానోరమా వంటి ఫీచర్లతో పాటు 1080p వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ ఉంది. సెల్ఫీల కోసం ముందు వైపు 8MP కెమెరా ఇచ్చారు. ఇది కూడా 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. క్యాజువల్ ఫోటోలు, వీడియో కాల్స్‌కు ఇది సరిపోతుంది. వివో Y31dలో స్నాప్ డ్రాగన్ 6s 4G జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఇది 4G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 5G లేని విషయం కొంతమందికి మైనస్‌గా అనిపించొచ్చు.

ఫోన్ ఆండ్రాయిడ్ 16పై ఆధారపడిన OriginOS 6తో వస్తుంది. స్మూత్ ఇంటర్‌ఫేస్, రోజువారీ వినియోగానికి ఉపయోగపడే ఫీచర్లతో ఇది డిజైన్ చేశారు. అలాగే ఇందులో డ్యూయల్ నానో-SIM సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.1, USB టైపు-C 2.0 (OTG సపోర్ట్) ఉన్నాయి. అయితే NFC లేదు. అలాగే 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇవ్వలేదు. అయితే స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇవి 400% వాల్యూమ్ బూస్ట్ ఇస్తాయని వివో చెబుతోంది. ఫింగర్‌ప్రింట్ సెన్సర్ పవర్ బటన్‌లోనే సైడ్ మౌంటెడ్‌గా ఉంది.

Jowar Flour Snack Recipe: బయట కొనాల్సిన పనిలేకుండా.. ఇంట్లోనే కరకరలాడే జొన్నపిండి నిప్పట్లు/చెక్కలు ఇలా చేసేయండి.!

ఈ మొబైల్ ఇప్పటికే కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లోని అధికారిక వివో వెబ్‌సైట్లలో కనిపిస్తోంది. ధర వివరాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫీచర్లను బట్టి చూస్తే.. ఇది అఫోర్డబుల్ నుంచి మిడ్‌రేంజ్ ధర సెగ్మెంట్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండవచ్చు.

Exit mobile version