Vivo Y100i Launch : మార్కెట్ లోకి వచ్చేసిన వివో స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ చైనా ఫోన్ కంపెనీ వివో సరికొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త ఫోన్లను లాంచ్ చేసింది.. వివో వై100ఐ గురువారం చైనాలో లాంచ్ అయింది. వివో లేటెస్ట్ వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్ 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
వివో వై100ఐ ఫీచర్లు..
Also Read
- Motorola: మోటో నుంచి విడుదలకు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. కీలక సమాచారం లీక్.. 200MP కెమెరాతో..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
- Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
వివో వై100ఐ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆర్జిన్ఓఎస్ 3పై రన్ అవుతుంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 91.6 స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.64-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ స్క్రీన్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే కేంద్రంగా ఉన్న హోల్ పంచ్ కటౌట్‌ను కూడా కలిగి ఉంది.. వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ని ఉపయోగించి ఆన్‌బోర్డ్ మెమరీని 24జీబీ వరకు విస్తరించవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 512జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్ వరకు వస్తుంది.. కెమెరా విషయానికొస్తే.. ఎఫ్/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వివో వై100iలో వై-ఫై, బ్లూటూత్ 5.1, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, తో పాటుగా యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, జీపీఎస్, ఎ-జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.. అంతేకాదు హ్యాండ్‌సెట్ ఐపీ54 రేటింగ్‌ను కూడా అందిస్తుంది. వివో వై100ఐ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.. ఇన్ని అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉన్న ఈ ఫోన్ బరువు 190 గ్రాములు ఉంటుంది..
ఇక ధర విషయానికొస్తే.. 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 1,599 (దాదాపు రూ. 15వేలు) ధర ఉంటుంది. ప్రస్తుతం చైనాలో వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా పౌడర్ (పింక్), స్కై బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది… ఇప్పటికే ఈ ఫోన్ సేల్స్ భారీగా పెరిగినట్లు కంపెనీ చెబుతుంది..
తాజావార్తలు
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!