Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
- వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్
- 50MP + 50MP + 200MP కెమెరాలు
- వచ్చే ఏడాది లాంచ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivo తన ఫ్లాగ్షిప్ X సిరీస్‌లో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి త్వరలో విడుదల కానున్న ఈ ఫోన్‌కు Vivo X500 Pro Max అనే పేరు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ఫోన్‌కు సంబంధించిన పలు కీలక వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి.
200MP పెరిస్కోప్ కెమెరాతో
చైనా ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (DCS) వీబోలో షేర్ చేసిన సమాచారం ప్రకారం, Vivo X500 Pro Max అత్యాధునిక కెమెరా సెటప్‌తో రానుంది. లీక్ అయిన వివరాల ప్రకారం ఫోన్లో 50MP Sony LYT సిరీస్ ప్రధాన కెమెరా, 200MP టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, మరో 50MP అదనపు సెన్సార్ ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ నాలుగు రియర్ కెమెరాలతో ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
Also Read
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
- Infinix Smart 20: ఇన్ఫినిక్స్ స్మార్ట్ 20 రిలీజ్ డేట్ ఫిక్స్.. 5,200mAh బ్యాటరీ, ధర రూ. 10,000 లోపే..!
- OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
2nm MediaTek చిప్సెట్
Vivo X500 Pro Maxలో కొత్త తరం 2nm MediaTek Dimensity చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. గత నివేదికల ప్రకారం, ఇది Dimensity 9600 సిరీస్ ప్రాసెసర్‌తో మార్కెట్లోకి రావచ్చని సమాచారం.
2K డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్
ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌లో 6.85 అంగుళాల పెద్ద డిస్ప్లేను అందించే అవకాశం ఉంది. LiPO (Low-Injection Pressure Overmolding) టెక్నాలజీతో రూపొందిన ఈ డిస్ప్లే 2K రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇవ్వనుందని తెలుస్తోంది.
భారీ 8000mAh బ్యాటరీ
Vivo X500 Pro Maxలో 8000mAh సామర్థ్యంతో కూడిన భారీ బ్యాటరీని అందించే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావొచ్చని సమాచారం. సాఫ్ట్వేర్ పరంగా ఈ ఫోన్ Android 17 ఆధారిత OriginOSపై పనిచేసే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది లాంచ్?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Vivo X500 Pro Max వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
Vivo X300 Ultra ఫీచర్లు
ఇటీవల విడుదలైన Vivo X300 Ultra కూడా ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకుంది.
ప్రధాన స్పెసిఫికేషన్లు:
6.82 అంగుళాల OLED డిస్ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
16GB వరకు RAM
512GB వరకు స్టోరేజ్
6600mAh బ్యాటరీ
100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
40W వైర్లెస్ ఛార్జింగ్
కెమెరా విభాగంలో 200MP ప్రధాన కెమెరా, 200MP సెకండరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. అత్యాధునిక కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో Vivo X500 Pro Max మార్కెట్లోకి వస్తే ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Peddi : పెద్దిపై మిక్డ్స్ టాక్.. కానీ ఆ ఒక్కదానికి అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే
-
Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
-
Xiaomi TV FX Mini LED Series: షియోమి TV FX Mini LED సిరీస్ విడుదల.. Dolby Vision, Fire TV, 4K డిస్ప్లే
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!