144Hz LTPO OLED డిస్‌ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్‌సెట్‌తో రానున్న Vivo X500 Pro..!

Vivo X500 Pro

Vivo X500 Pro

Vivo X500 Pro: వివో (Vivo) నుండి రాబోయే ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X500 Proను అతి త్వరలో చైనా మార్కెట్లో లాంచ్ కానుంది. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు వరుసగా లీక్ అవుతున్నాయి. తాజా లీక్ ల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక 2nm MediaTek Dimensity 9600 Pro చిప్‌సెట్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన BOE OLED డిస్‌ప్లేతో రాబోతుంది.

ప్రముఖ టిప్‌స్టర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. Vivo X500 Proలో 6.37 అంగుళాల ఫ్లాట్ LTPO OLED డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ స్క్రీన్ 1.5K కంటే ఎక్కువ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ను అందించే అవకాశం ఉంది. అలాగే BOE రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ OLED ప్యానెల్‌ను తీసుకరాబోతున్నట్లు సమాచారం.

ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉందని లీక్ పేర్కొంది. ఇది 2nm తయారీ ప్రక్రియపై రూపొందే చిప్‌సెట్ కావడంతో ఫాస్ట్ పనితీరు, అధిక పవర్ ఎఫిషియెన్సీ అందించనుందని అంచనా. Vivo X500 Proలో LIPO డిస్‌ప్లే ప్యాకేజింగ్ టెక్నాలజీను ఉపయోగించే అవకాశం ఉంది. దీని వల్ల స్క్రీన్ చుట్టూ నాలుగు వైపులా చాలా పలుచని బెజెల్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే Vivo X సిరీస్‌కు ప్రత్యేకమైన మధ్యలో వృత్తాకార (Circular) కెమెరా మాడ్యూల్ డిజైన్‌ను కొనసాగించనున్నట్లు సమాచారం. ఫోన్‌కు ప్రీమియం మెటల్ ఫ్రేమ్ కూడా ఉండొచ్చు.

గతంలో వచ్చిన లీక్‌ల ప్రకారం, Vivo X500 Proను కంపెనీ సెప్టెంబర్‌లో చైనా మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఉన్న Vivo X300 Proకు సక్సెసర్‌గా రానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న Vivo X300 Pro భారతదేశంలో రూ.1,09,999 ధరతో 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.