Vivo X300e: వివో X300e విడుదల.. 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్
- వివో X300e విడుదల
- 7,200mAh భారీ బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా
- 12GB + 256GB - 4,799 యువాన్లు (సుమారు రూ.69,000)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో (Vivo) కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Vivo X300eను అధికారికంగా చైనాలో విడుదల చేసింది. జూలై 27న లాంచ్ అయిన ఈ ఫోన్, Vivo X300 సిరీస్‌లో ఐదో మోడల్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే కంపెనీ Vivo X300, Vivo X300 Pro, Vivo X300s, Vivo X300 Ultra మోడళ్లను పరిచయం చేయగా, ఇప్పుడు X300e కూడా శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. పెద్ద బ్యాటరీ, ZEISS ఆధారిత కెమెరా వ్యవస్థ, Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, ప్రీమియం AMOLED డిస్ప్లేతో ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.
Vivo X300e ధర, రంగులు
Vivo X300e రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
Also Read
- Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
- Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
- itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
12GB + 256GB – 4,799 యువాన్లు (సుమారు రూ.69,000)
12GB + 512GB – 5,299 యువాన్లు (సుమారు రూ.75,000)
ఈ ఫోన్ Moonlight White, Midnight Black, Sunlight Orange రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో విక్రయాలు ప్రారంభం కాగా, త్వరలో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
Vivo X300e స్పెసిఫికేషన్లు
Vivo X300eలో 6.59 అంగుళాల AMOLED ఫ్లాట్ డిస్ప్లేను అందించారు. ఇది 2750 × 1260 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 10-బిట్ కలర్ సపోర్ట్ తో వస్తుంది. గేమింగ్ కోసం 2,000Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా, AI Eye Comfort ఫీచర్లు, SGS Low Blue Light సర్టిఫికేషన్, Ultrasonic In-Display Fingerprint Sensor వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తడి వేళ్లతో కూడా ఫోన్‌ను సులభంగా అన్‌లాక్ చేయవచ్చు.
Snapdragon 8 Gen 5తో శక్తివంతమైన పనితీరు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో తాజా Qualcomm Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ జత చేశారు. ఫలితంగా వేగవంతమైన పనితీరు, మల్టీటాస్కింగ్, గేమింగ్ అనుభవం లభిస్తుంది. ఇందులో 7,200mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. సాఫ్ట్వేర్ పరంగా Android 16 ఆధారిత OriginOS 6పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
50MP ట్రిపుల్ కెమెరా సెటప్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం Vivo X300eలో ZEISS సహకారంతో రూపొందించిన కెమెరా వ్యవస్థను అందించారు. ముందు భాగంలో 50MP Samsung JN1 సెల్ఫీ కెమెరా (ఆటోఫోకస్‌తో), వెనుక భాగంలో 50MP Sony IMX921 ప్రైమరీ కెమెరా (OIS), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (OIS, 3x ఆప్టికల్ జూమ్). ఈ కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ కు మద్దతు ఇస్తాయి. సెల్ఫీ కెమెరాతో పాటు ప్రధాన, టెలిఫోటో కెమెరాల ద్వారా కూడా 4K వీడియోలను చిత్రీకరించవచ్చు.
ఇతర ముఖ్యమైన ఫీచర్లు
Vivo X300eలో పలు ఆధునిక కనెక్టివిటీ, భద్రతా ఫీచర్లు ఉన్నాయి. స్టీరియో స్పీకర్లు,X-యాక్సిస్ లీనియర్ మోటార్, VC కూలింగ్ సిస్టమ్, NFC, IR బ్లాస్టర్, డ్యూయల్ సిమ్ 5G
Wi-Fi 7, బ్లూటూత్ 5.4, USB టైప్-C, IP68 & IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
How to Choose Sweet Apples: యాపిల్ కొనేటప్పుడు రంగు చూసి మోసపోవద్దు.. తియ్యటి పండు కోసం సింపుల్ చిట్కాలు
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!