Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
- వివో ఎక్స్ 300 అల్ట్రా త్వరలో లాంచ్
- 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ
- టెక్ లవర్స్‌లో హాట్ టాపిక్‌గా వివో ఎక్స్ 300 అల్ట్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo X300 Ultra Camera and Battery: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్‌ను షేక్ చేయడానికి వివో ఎక్స్ 300 అల్ట్రా (V2562) రెడీ అవుతోంది. టాప్ ఎండ్ కెమెరా సెటప్, పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ టెక్ లవర్స్‌లో ఇప్పటి నుంచే హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ లీక్స్ ప్రకారం.. ఈ ఫోన్ గ్లోబల్‌తో పాటు ఇండియా లాంచ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. వివో ఎక్స్ 300 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లీక్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం.
వివో ఎక్స్ 300 అల్ట్రాలో హైలైట్ ఏంటంటే కెమెరా సిస్టమ్. ఈ ఫోన్లో 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ లెన్స్, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇవ్వనున్నారని సమాచారం. అంతేకాదు కలర్ యాక్యూరసీ మరింత మెరుగ్గా ఉండేందుకు ప్రత్యేకంగా 5MP కలర్ సెన్సర్ కూడా ఉండబోతుందట. సెల్ఫీల కోసం 50MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరా ఇవ్వనుండగా.. కంటిన్యూయస్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉండటం ఈ ఫోన్‌ను కెమెరా లవర్స్‌కు డ్రీమ్ డివైస్‌గా మార్చనుంది.
Also Read
- OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- Vivo X500 Pro Max: వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.. 50MP + 50MP + 200MP కెమెరాలు.. 8000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
Also Read: Takshakudu Teaser: ఆసక్తిగా ‘తక్షకుడు’ టీజర్.. సరికొత్త అవతార్‌లో ఆనంద్ దేవరకొండ!
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో వివో ఎక్స్ 300 అల్ట్రా రానుందని టాక్. దాంతో హైఎండ్ గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 6.82 ఇంచెస్ 2K ఫ్లాట్ LTPO OLED డిస్ప్లే ఇవ్వనుండగా, స్మూత్ విజువల్స్‌తో పాటు పవర్ ఎఫిషియెన్సీ కూడా మెరుగ్గా ఉండనుంది. బ్యాటరీ విషయంలో కూడా వివో రాజీ పడడం లేదు. ఈ ఫోన్లో 7000mAh భారీ బ్యాటరీ ఇవ్వనున్నారని సమాచారం. దీనికి 100W ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, 40W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం మరో పెద్ద ప్లస్. కనెక్టివిటీ కోసం USB 3.2, భద్రత కోసం అండర్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇవ్వనున్నారు. అదనంగా IP69 రేటింగ్ ఉండటంతో నీరు, ధూళి నుంచి ఫోన్‌కు పూర్తి రక్షణ లభించనుంది.
వివో ఎక్స్ 300 అల్ట్రా ఫ్లాగ్షిప్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది. కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, పెర్ఫార్మెన్స్.. అన్నీ టాప్ క్లాస్ స్పెసిఫికేషన్స్‌తో రానుంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే భారీ క్రేజ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారిక లాంచ్ డేట్, ధర వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!