50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?

  • డిస్‌ప్లే: 6.83 అంగుళాల 1.5K కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
  • కెమెరా: 50MP Sony IMX852 మెయిన్ కెమెరా, 2MP బొకే కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్.
  • సెల్ఫీ కెమెరా: వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా.
  • ప్రాసెసర్: 4nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 7360-Turbo చిప్‌సెట్..
Vivo V80 Lite 5g

Vivo V80 Lite 5g

Vivo V80 Lite 5G: వివో (Vivo) నుండి కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. Vivo V80 లైట్ 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ప్రీమియం డిజైన్‌తో పాటు డివైస్‌కు IP68, IP69 రేటింగ్స్ కూడా అందించారు.

ఈ కొత్త మొబైల్ లో 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 449ppi పిక్సెల్ డెన్సిటీతో పనిచేస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో ఫోన్ ముందు భాగం ప్రీమియం లుక్‌ను కలిగి ఉండగా.. వెనుక భాగంలో హారిజాంటల్ కెమెరా బార్‌ను అందించారు. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, సిమెట్రికల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం Vivo V80 Lite 5Gలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ IMX852 మెయిన్ కెమెరాతో పాటు 2MP బొకే కెమెరా అందించారు. వీటికి రింగ్ LED ఫ్లాష్‌ను జత చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది.

పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm ప్రాసెస్‌పై తయారైన MediaTek Dimensity 7360-Turbo చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 8GB LPDDR4X RAM అందించారు. స్టోరేజ్ విషయానికి వస్తే 128GB, 256GB UFS 3.1 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. అదనంగా 8GB వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రూపొందించిన OriginOS 6పై ఫోన్ పనిచేస్తుంది. వివో V80 లైట్ 5Gలో 7,050mAh బ్యాటరీ అందించారు. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా Bluetooth 5.4, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB 2.0 Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

డ్యూరబిలిటీ విషయంలో Vivo V80 Lite 5Gకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ లభించాయి. దీంతో దుమ్ము, నీటి నుంచి మెరుగైన రక్షణ లభిస్తుంది. అంతేకాకుండా ఫోన్ ఐదు MIL-STD-810H సర్టిఫికేషన్లను పొందింది. ఏడు రకాల ఉపరితలాలపై డ్రాప్ టెస్టింగ్ కూడా నిర్వహించినట్లు కంపెనీ పేర్కొంది. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే సాప్ఫిరే బ్లూ, సిల్క్ వైట్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ మొబైల్ పాకిస్థాన్‌లో లాంచ్ కాగా.. అక్కడ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటి ధరలు ఇలా ఉన్నాయి.
* 8GB + 128GB: PKR 124,999 (సుమారు $450).
* 8GB + 256GB: PKR 145,999 (సుమారు $525).