VIVO V80: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ తన కొత్త V సిరీస్ స్మార్ట్‌ఫోన్ వివో V80ను అక్టోబర్ 6న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే టీజర్ల ద్వారా ఫోన్‌కు సంబంధించిన పలు ఫీచర్లను వెల్లడించిన వివో.. కెమెరా, డిస్‌ప్లే, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ పరంగా అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది.
ZEISS కెమెరాలతో ఫొటోగ్రఫీ
వివో V80 కెమెరా విభాగంలో ZEISSతో కలిసి పనిచేస్తోంది. ఇందులో 50MP ZEISS OIS ప్రధాన కెమెరాను సోనీ LYTIA 700V 1/1.56 అంగుళాల సెన్సార్‌తో అందించారు. దీనికి తోడు 50MP ZEISS నైట్ టెలిఫొటో కెమెరా ఉంది. ఇది 1/1.95 అంగుళాల IMX882 సెన్సార్, OIS, 3x ఆప్టికల్ జూమ్, గరిష్ఠంగా 100x జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో ZEISS అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP ZEISS గ్రూప్ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇది 92 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూ, ఆటోఫోకస్‌కు సపోర్ట్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 4K సినిమాటిక్ వీడియోతో పాటు సెకనుకు 60 ఫ్రేమ్‌ల వేగంతో 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు.
AI ఫీచర్లు
కెమెరా అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు vivo V80లో 30కి పైగా AI ఆధారిత క్రియేటివ్ టూల్స్‌ను అందిస్తోంది. Live Sticker Collage తో సాధారణ ఫొటోలను థర్డ్ పార్టీ ఎడిటింగ్ యాప్స్ అవసరం లేకుండానే సోషల్ మీడియాకు అనువైన పోస్టులుగా మార్చుకోవచ్చు. Pet Pals, Snap Note, Security Shield వంటి ఇతర AI టూల్స్ కూడా ఇందులో ఉంటాయి. ప్రత్యేకంగా AI దీవాలి పోర్ట్రైట్ 2.0 ఫీచర్ పండుగ ఫొటోగ్రఫీపై ఫోకస్ చేస్తుంది. దీని ద్వారా వెచ్చని లైటింగ్, రంగోలి వంటి అంశాలను గుర్తించి ఫొటోలకు మరింత ఆకర్షణీయమైన లుక్ అందించనుంది. క్లిష్టమైన లైటింగ్ పరిస్థితుల్లో స్కిన్ టోన్స్‌ను మెరుగుపరచడంతో పాటు సినిమాటిక్ ఫెస్టివ్ గ్లోను కూడా అందిస్తుంది.
1.5K 144Hz OLED డిస్‌ప్లే
ఇందులో 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది గరిష్ఠంగా 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1.07 బిలియన్ రంగులకు సపోర్ట్ చేస్తుంది. స్థానికంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించనున్న ఈ స్క్రీన్.. తక్కువ వెలుతురు పరిస్థితుల్లో కేవలం 1 నిట్ వరకు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోగలదు. డిస్‌ప్లే చుట్టూ 1.25 మిల్లీమీటర్ల సన్నని బెజెల్స్ ఉంటాయి.
7,200mAh భారీ బ్యాటరీ
బ్యాటరీ విషయంలో vivo V80 V-సిరీస్ లోనే కొత్త రికార్డు సృష్టించనుంది. ఇందులో ఏకంగా 7,200mAh బ్యాటరీని అందించారు. వివో ప్రకారం ఈ బ్యాటరీతో గరిష్ఠంగా 14 గంటల పాటు నిరంతర నావిగేషన్, 39.5 గంటల వరకు లోకల్ వీడియో ప్లేబ్యాక్ చేయవచ్చు. 90W FlashCharge సపోర్ట్ ఉండగా.. ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ లో కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీని 50%కి చార్జ్ చేయవచ్చని కంపెనీ వెల్లడించింది.
మూడు కలర్ ఆప్షన్లు
డిజైన్ పరంగా వివో V80లో వన్-పీస్ కోల్డ్-కార్వ్డ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను ఉపయోగించారు. ఫ్లోటింగ్ కెమెరా మాడ్యూల్ డిజైన్‌తో ఫోన్‌కు ప్రత్యేకమైన లుక్ ఇచ్చారు. సన్ రైజ్ అంతెం, హరిజోన్ బ్లూ, స్టెల్లార్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. సాఫ్ట్‌వేర్ పరంగా కూడా vivo V80 ప్రత్యేకతను సొంతం చేసుకుంది. V-Series స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా OriginOS 7ను అవుట్ ఆఫ్ ది బాక్స్ అందిస్తున్నారు. కొత్త UI, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్స్‌తో వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా వివో ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తోంది.
ధర
ఇంకా మొబైల్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 6న మధ్యాహ్నం 12 గంటలకు జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో ధర, వేరియంట్ల వివరాలు వెల్లడికానున్నాయి. లాంచ్ అనంతరం ఈ ఫోన్ vivo.com, అమెజాన్ ఇండియా, ఫ్లిప్కార్ట్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
Introducing the all-new vivo V80. Your world is about to look a whole
lot more cinematic. Launching on 6th October.#vivoV80 #MyCinematicMoments #ZEISSPortraitSoPro pic.twitter.com/bIgCRNTgtl— vivo India (@Vivo_India) September 22, 2026

