Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
- వివో V70 లైట్ విడుదల
- 6500mAh బ్యాటరీ
- 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,099 (సుమారు రూ. 28,500)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V70 లైట్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎలాంటి ప్రత్యేక లాంచ్ ఈవెంట్ లేకుండానే కంపెనీ ఈ ఫోన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అధునాతన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
వివో V70 లైట్ ధర
వివో V70 లైట్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
Also Read
- థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
- లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
- 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
- 10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,099 (సుమారు రూ. 28,500)
8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర AED 1,299 (సుమారు రూ. 33,500)
ఈ స్మార్ట్‌ఫోన్ నలుపు (Black), బంగారు (Gold) రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.
డిస్ప్లే, డిజైన్
వివో V70 లైట్లో 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే 3,000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను అందించడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. పంచ్-హోల్ డిజైన్‌తో ఫోన్‌కు ప్రీమియం లుక్ లభించింది.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు.
50MP Sony IMX882 ప్రైమరీ కెమెరా (f/1.8 అపర్చర్), 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అందించారు.
ప్రాసెసర్, స్టోరేజ్
వివో V70 లైట్లో MediaTek Dimensity 7400 Turbo చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్, గేమింగ్‌కు మెరుగైన పనితీరును అందిస్తుంది. ఫోన్లో 8GB RAMతో పాటు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు.
భారీ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. అలాగే 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. వివో V70 లైట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 కస్టమ్ స్కిన్‌తో వస్తుంది. కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు, మెరుగైన యూజర్ అనుభవాన్ని ఇది అందించనుంది. మొత్తంగా చూస్తే, మధ్యతరగతి ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు వివో V70 లైట్ మంచి ఎంపికగా నిలవొచ్చు.
- Tags
- vivo
- Vivo V70 Lite
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు