Vivo V70 FE: త్వరలోనే Vivo V70 సిరీస్‌ను విడుదల చేయనుందని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ కొత్త సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్ ఉండే అవకాశం ఉంది. ఇందులో Vivo V70, Vivo V70 Elite 5G, Vivo V70 FE 5G, Vivo V70 Lite 5G ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, Vivo V70 FE యూరప్‌లోని సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించడంతో త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్‌లోకి విడుదల కాబోతుందని అంచనా వేస్తున్నారు. కాగా, యూరోపియన్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ ఫర్ ఎనర్జీ లేబెలింగ్ (EPREL) డేటాబేస్‌లో Vivo V2550 అనే మోడల్ నంబర్‌తో ఒక స్మార్ట్‌ఫోన్ లిస్ట్ అయ్యింది. ఈ మోడల్‌నే Vivo V70 FEగా గుర్తించారు. ఈ లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ, ఛార్జింగ్ సామర్థ్యం, డ్యూరబిలిటీ వంటి కీలక వివరాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
Read Also: Karnataka: ఓలా, ఉబర్, ర్యాపిడోలకు గుడ్‌న్యూస్ చెప్పిన హైకోర్టు..
అయితే, Vivo V70 FEలో భారీ బ్యాటరీ ఇవ్వనున్నారు. దీనికి 6,870mAh రేటెడ్ కెపాసిటీ ఉండగా, మార్కెటింగ్ పరంగా దీన్ని 7,000mAh బ్యాటరీగా ప్రచారం చేయనున్నారు. ఇది USB టైప్-C ద్వారా 55W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 67 గంటల 21 నిమిషాల వరకు బ్యాటరీ బ్యాకప్ అందుతుందని EPREL లిస్టింగ్‌లో పేర్కొన్నారు. ఈ ఫోన్‌కు ఎనర్జీ ఎఫిషియెన్సీ పరంగా ‘క్లాస్ B’ రేటింగ్ వచ్చింది. అలాగే, డ్రాప్ ప్రొటెక్షన్, రిపేరబిలిటీకి కూడా ‘B’ గ్రేడ్ ఇచ్చారు. బ్యాటరీ పని తీరు విషయంలో ఇది 1,600 ఛార్జింగ్ సైకిల్స్ వరకు తన ఒరిజినల్ సామర్థ్యంలో 80 శాతం వరకు నిలుపుకుంటుందని సమాచారం. అంటే దీర్ఘకాలం ఉపయోగించినా బ్యాటరీ అద్భుతంగా ఉంటుంది.
కాగా, డ్యూరబిలిటీ విషయంలో Vivo V70 FE మరింత బలంగా ఉండనుంది. దీనికి IP68 రేటింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే ఇది ధూళి, నీటి నుంచి పూర్తిగా రక్షణ లభిస్తుంది. 1.5 మీటర్ల లోతు వరకు నీటిలో ముంచినా ఫోన్ సురక్షితంగా పని చేస్తుంది. అలాగే, స్క్రీన్‌కు మోహ్స్ హార్డ్నెస్ స్కేల్‌పై లెవల్ 4 స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉంది. సాధారణ వాడకంలో గీతలు పడకుండా సేఫ్ గార్డ్ లభిస్తుంది. సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఇది మంచి సపోర్ట్ అందుకునే అవకాశం ఉంటుంది. Vivo V70 FEకు ఐదు సంవత్సరాల వరకు అప్‌డేట్స్ అందుతాయని లిస్టింగ్లో సూచిస్తోంది. ఇది ఫోన్‌ను దీర్ఘకాలం ఉపయోగించేవారికి పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలుస్తుంది.
Read Also: KTR: విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం
అలాగే, రిపేరబిలిటీ విషయంలో ఈ ఫోన్‌కు ‘C’ రేటింగ్ ఇచ్చారు. అంటే మరమ్మతులు చేయడం సగటు స్థాయిలో సులభంగా ఉంటుందని అర్థం. EPREL ఎనర్జీ లేబుల్ యూరోపియన్ యూనియన్‌లో తప్పనిసరి సర్టిఫికేషన్.. ఇది ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్‌కు ఎనర్జీ క్లాస్, బ్యాటరీ ఎండ్యూరెన్స్, డ్యూరబిలిటీ వంటి వివరాలను వినియోగదారులకు స్పష్టంగా చూపిస్తుంది. 2025 జూన్ 20 తర్వాత యూరప్ మార్కెట్‌లోకి వచ్చే ఉత్పత్తులన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఉత్పత్తుల జీవనకాలాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యం. ఇప్పటికే స్టాండర్డ్ Vivo V70 కూడా EPREL డేటాబేస్‌లో V2538 మోడల్ నంబర్‌తో కనిపించింది. ఇప్పుడు Vivo V70 FE కూడా లిస్ట్ కావడంతో, మొత్తం Vivo V70 సిరీస్ త్వరలోనే యూరప్ మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
