NTV Telugu Site icon

Vivo V30e Launch: వివో నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్.. సూపర్ ఫీచర్స్… ధర?

vivo v30

vivo v30

ప్రముఖ మొబైల్ కంపెనీ వివో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడే తెలుసుకుందాం..

వివో నుంచి V 30e ఫోన్ ను మార్కెట్ లోకి వదిలింది.. అద్భుతమైన డిజైన్, అత్యుత్తమ కెమెరాలను కలిగి ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో 5500 ఎంఎహెచ్ బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్లు ఇప్పుడు లాంచ్ చేశారు.. కానీ ఈ నెల 9 నుంచి మార్కెట్ లోకి సేల్ కు రాబోతుందని నిపుణులు చెబుతున్నారు. 50ఎంపీ ఓఐఎస్ సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్  సామర్థ్యాలను అందిస్తుంది..

అంతేకాదు.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ ఒక ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది.. వివో ఎన్‌బీఎఫ్‌సీ పార్టనర్లతో ఫ్లాట్ 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌లతో సహా ఆకర్షణీయమైన ప్రీ-బుకింగ్ ఆఫర్‌లను అందిస్తుంది.. అలాగే ప్రముఖ బ్యాంకుల కార్డుల నుంచి కొనుగోలు చేస్తే ధర తగ్గుతుంది.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. వెల్వెట్ రెడ్, సిల్క్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 27,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు.. ఫ్రీ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి..

Show comments