Ulefone తన సరికొత్త టాబ్లెట్ Ulefone Tab W10ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ట్యాబ్ ఆకర్షణీయమైన డిజైన్.. శక్తివంతమైన పనితీరు, అధిక ఫీచర్లను కలిగి ఉంది. సాధారణ వినియోగదారులు, నిపుణులను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ట్యాబ్‌లో 10 అంగుళాల డిస్‌ప్లే, హెవీ ర్యామ్‌తో పాటు 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ ఉంది. అలాగే.. 6600mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఈ ట్యాబ్ గురించి మరిన్నీ వివరాలు తెలుసుకుందాం…
Read Also: Sanjay Raut: మహాయుతి ప్రభుత్వంపై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు.. ఈవీఎంల ఆలయాన్ని నిర్మించాలంటూ..!
స్లిమ్ బాడీ:
Ulefone Tab W10 ట్యాబ్.. తేలికైన, పోర్టబుల్ బిల్ట్‌తో వస్తుంది. దీని బరువు 430 గ్రాములు మాత్రమే. ఇది 7.85 mm సన్నగా ఉంటుంది. ఇది మీ చేతికి లేదా బ్యాగ్‌లో సౌకర్యవంతంగా సరిపోతుంది. ఈ ట్యాబ్ ప్రీమియం ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం బాడీతో స్టైలిష్ లుక్‌తో వస్తుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ (బ్యాక్ కెమెరా), 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. సౌండ్ కోసం డ్యూయల్ స్పీకర్ సెటప్‌ను కలిగి ఉంది.
డిస్‌ప్లే:
ఈ ట్యాబ్‌లో 10.1-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది వెబ్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి పనులను చేస్తున్నప్పుడు గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఈ ట్యాబ్ యునిసాక్ T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో అమర్చారు. ఇది గరిష్టంగా 8GB RAM, 128GB స్టోరేజ్‌ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్‌తో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
బ్యాటరీ:
ఈ ట్యాబ్ 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 6600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని, 415 గంటల స్టాండ్‌బై సమయాన్ని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, హులు, అమెజాన్ ప్రైమ్ వీడియో.. డిస్నీ+ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో హై-డెఫినిషన్ ప్లేబ్యాక్‌ను ప్రారంభించే వైడ్‌వైన్ ఎల్1 సర్టిఫికేషన్‌తో ఇది అమర్చబడింది. ఇందులో స్క్రీన్, ఆడియో అద్భుతంగా ఉంటుంది.
ధర:
Ulefone Tab W10 ఇప్పుడు కంపెనీ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. దీని ధర $119.99 (అంటే దాదాపు రూ. 10 వేలు).