Truecaller: ట్రూకాలర్ రీబ్రాండింగ్.. AI తో మరిన్ని ఫీచర్స్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనకు తెలియని కొత్త నెంబర్స్ ను గుర్తించడానికి వాడే యాప్ ట్రూకాలర్.. ఎక్కడ నుంచి ఎప్పుడూ చేశారు.. వారి ఫోటో మరియు వివరాలను తెలుపుతుంది. స్పామ్ కాల్స్ ను నోటిఫై చేసి వాటిని బ్లాక్ చేయడం దీనిలో స్పెషాలిటీ.. కాగా పెరుగుతున్న టెక్నాలజీ, అలాగే సైబర్ క్రైమ్ లను తగ్గించడానికి కూడా ఇందులో సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు..
గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ ప్రకటించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తోందని పేర్కొంది. తద్వారా ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. ప్రస్తుతం మార్చిన పేరును తెలియజేస్తుందని అధికారులు తెలిపారు.. ఈ యాప్ ఆయా నంబర్లను మూడు రంగులుగా వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పుకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత మరియు స్కామర్ కార్యకలాపాలను గుర్తిస్తే ఎరుపు రంగు సూచిస్తూ అలర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ సహా iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ కు కూడా ఈ ఫీచర్ ను అందిస్తుంది.
Also Read
- 18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
- Vivo V80 Lite: వివో వి80 లైట్ లాంచ్ డేట్ ఫిక్స్.. 10,000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న వివో ఫోన్
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్
ఇకపోతే యాప్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకోసం సెర్చ్ అనుభవంతో పాటు గోప్యతను మెరుగుపరచేందుకు, మోసాలను నిరోధించేందుకు పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం’ అని CEO అలాన్ మామెడి తెలిపారు.. చాలా మంది యాప్ ను ఉపయోగిస్తున్నారు.. వీరందరి రక్షణ కోసమే సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు.. వీటితో పాటు మరెన్నో ఫీచర్స్ ను అందిస్తుంది..
తాజావార్తలు
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
-
Drug Syndicate : డ్రగ్స్ రాజధానిపై ‘ఈగల్ ఫోర్స్’ ఉక్కుపాదం.. రూ.6 కోట్ల ఆస్తులు జప్తు.!
-
Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
-
Makkah: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్‌కు ముప్పు పొంచి ఉందా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!