TRAI: స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇకపై నంబర్‌తో పాటు పేరు కూడా.. అందుబాటులోకి CNAP సేవలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRAI: భారత టెలికమ్యూనికేషన్ రంగంలో ఒక కీలక మార్పు రాబోతోంది. ఇకపై కాల్ వచ్చే సమయంలో నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా కచ్చితంగా కనిపించేలా ట్రాయ్ (TRAI) CNAP సేవకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పామ్ కాల్స్‌ను అరికట్టే దిశగా కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవను డీఫాల్ట్ ఫీచర్‌గా ప్రవేశపెట్టాలని ట్రాయ్ అంగీకరించింది. అక్టోబర్ 28న విడుదలైన ఈ నిర్ణయం ప్రకారం ఇకపై కాల్ చేసిన వారి పేరు నంబర్‌తో పాటు రిసీవ్ చేసుకొనే వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది.
Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ఈ సేవ అమలుకు సంబంధించిన చర్చలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. 1997 TRAI చట్టంలోని సెక్షన్ 11(1)(a) ప్రకారం CNAP సేవ సాధ్యాసాధ్యాలపై సిఫార్సులు ఇవ్వాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) 2022 మార్చిలో ట్రాయ్‌ను సంప్రదించింది. ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో ట్రాయ్ తన తొలి సిఫార్సులను సమర్పించగా.. 2025 సెప్టెంబరులో DoT పునఃపరిశీలన కోరింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజాగా ఇచ్చిన సమాధానంలో ప్రభుత్వ సూచనలను పరిగణనలోకి తీసుకుని కొన్ని కీలక మార్పులతో తన మునుపటి సిఫార్సులను పునరుద్ధరించింది.
CNAP సేవ ప్రధానంగా మోసపూరిత, స్పామ్ కాల్స్‌ను అరికట్టడమే లక్ష్యంగా దశలవారీగా ప్రవేశపెట్టబడుతుంది. ఇది అన్ని వినియోగదారులకూ డీఫాల్ట్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, అవసరమైతే ఆప్షనల్‌గా డిసేబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. వినియోగదారుల పేర్లు KYC ధృవీకరించిన వివరాల ఆధారంగా చూపిస్తాయి. లైసెన్సింగ్ నియమాల్లో కాలింగ్ లైన్ ఐడెంటిఫికేషన్ (CLI) నిర్వచనాన్ని విస్తరించి.. కాలింగ్ నేమ్ (CNAM)ను కూడా చేర్చనున్నారు. గోప్యత రక్షణలో భాగంగా.. CLIR ఎంచుకున్న వినియోగదారుల పేర్లు మాత్రం ప్రదర్శించబడవు.
వ్యాపార వినియోగదారులు తమ ట్రేడ్ నేమ్ లేదా ట్రేడ్‌మార్క్‌ను కాలర్ ఐడెంటిటీగా చూపించుకునే వీలు ఉంటుంది. కానీ, అది ప్రభుత్వ ధృవీకరణ ప్రక్రియకు లోబడి ఉంటుంది. అలాగే కొత్త మొబైల్ పరికరాల్లో CNAP ఫీచర్ తప్పనిసరిగా ఉండేలా MeitY (ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ) తో సమన్వయం చేయాలని ట్రాయ్ ప్రకటించింది. ఈ సేవను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ITU, ETSI మార్గదర్శకాలకు అనుగుణంగా సప్లిమెంటరీ సేవగా వర్గీకరించారు. ట్రాయ్ తాజా నిర్ణయం మేరకు DoT టెలికాం ఆపరేటర్లకు ఒక వారంలో కనీసం ఒక సర్కిల్‌లో CNAP సేవ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 60 రోజుల పైలట్ దశ పూర్తి చేసిన అనంతరం దేశవ్యాప్త రోల్‌అవుట్ జరగనుంది. ఈ కొత్త మార్పు ద్వారా కాల్ ట్రాన్స్‌పరెన్సీ పెరగడం, స్పామ్ లేదా మోసపూరిత కాల్స్‌ను సమర్థవంతంగా అరికట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు