Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్‌ఫోన్లు.. 2TB స్టోరేజ్‌, ధరలు తెలిస్తే షాక్!

  • భారత్‌లో కాస్ట్‌లీ స్మార్ట్‌ఫోన్లు
  • iPhone, Samsung ధరలు చూస్తే షాక్!
Galaxy Z Fold8 Ultra

Galaxy Z Fold8 Ultra

Top 5 Expensive Phones: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా Apple, Samsung వంటి ప్రముఖ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లు, ఎక్కువ స్టోరేజ్‌తో ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్లలో టాప్ 5 ఇవే.

1. iPhone Duo – రూ.4,49,900

ఈ జాబితాలో అత్యంత ఖరీదైన ఫోన్‌గా iPhone Duo నిలిచింది. 2TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.4,49,900గా ఉంది. భారీ స్టోరేజ్‌తో పాటు ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్ రూపొందించారు.

2. iPhone 18 Pro Max – రూ.3,29,900

Apple లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో iPhone 18 Pro Maxకు ప్రత్యేక స్థానం ఉంది. 2TB స్టోరేజ్‌తో వచ్చే ఈ వేరియంట్ ధర రూ.3,29,900. అత్యధిక స్టోరేజ్, ప్రీమియం డిజైన్, ఫ్లాగ్‌షిప్ పనితీరు కోరుకునే వారికి ఇది టాప్-ఎండ్ ఆప్షన్.

3. iPhone 18 Pro – రూ.3,14,900

ఈ జాబితాలో మూడో స్థానంలో iPhone 18 Pro ఉంది. 2TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.3,14,900గా ఉంది. Pro Maxతో పోలిస్తే కొంత తక్కువ ధరలోనే ప్రీమియం Pro సిరీస్ అనుభవాన్ని అందించే మోడల్‌గా ఇది నిలుస్తోంది.

4. Galaxy Z Fold8 Ultra – రూ.2,54,999

Samsung ఫోల్డబుల్ ఫోన్ సెగ్మెంట్‌లో Galaxy Z Fold8 Ultra కూడా భారీ ధరతో అందుబాటులో ఉంది. 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,54,999. ఫోల్డబుల్ డిస్‌ప్లేతో పాటు అధునాతన ఫీచర్లు, ఎక్కువ స్టోరేజ్ కోరుకునే ప్రీమియం వినియోగదారులకు ఇది టార్గెట్ గా మారింది.

5. Galaxy Z Fold8 – రూ.2,34,999

టాప్ 5 జాబితాలో చివరి స్థానంలో Samsung Galaxy Z Fold8 ఉంది. 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.2,34,999. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అనుభవంతో పాటు పెద్ద స్టోరేజ్ కావాలనుకునే వారికి ఇది ప్రీమియం ఆప్షన్.

భారత్‌లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంత వేగంగా మారుతోందో ఈ ధరలు చూస్తే అర్థమవుతుంది. రూ.2 లక్షలకు పైగా ధర ఉన్న ఫోన్ల నుంచి రూ.4.49 లక్షల వరకు ఖరీదైన మోడళ్లు ప్రస్తుతం ఈ జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా Apple, Samsung సంస్థల ఫ్లాగ్‌షిప్, ఫోల్డబుల్ ఫోన్లు ఈ ప్రీమియం సెగ్మెంట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.