జియోటెల్ OS, HDR10+ డిస్‌ప్లేతో మొదటి QLED టీవీలను లాంచ్ చేసిన Thomson!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thomson: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా థామ్సన్ సంస్థ భారతదేశంలో కొత్త 50, 55 అంగుళాల జియోటెల్ OS QLED స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. భారతదేశంలో జియోటెల్ OSతో టీవీలను ప్రారంభించిన మొట్టమొదటి బ్రాండ్ థామ్సన్. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. జియో రూపొందించిన భారతదేశపు స్వంత స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్ అయిన జియోటెల్ OSతో ఈ కొత్త టీవీలు వస్తున్నాయి. ఇవి భారతీయ గృహాలకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి.
కాలేయాన్ని పరిశుభ్రంగా,ఆరోగ్యంగా ఉంచే రహస్య ఆహారాలు: ఇవి తప్పక తినండి!
Also Read
- Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ఈ టీవీలు బెజిల్-లెస్ డిజైన్, ప్రీమియం అలాయ్ స్టాండ్‌లతో వస్తాయి. ఇవి 1.1 బిలియన్ రంగులతో, HDR10+తో కూడిన QLED 4K డిస్‌ప్లేను (3840 × 2160 పిక్సెల్స్) కలిగి ఉంటాయి. దీని బ్రైట్‌నెస్ 450 నిట్స్ వరకు ఉంటుంది. ప్రత్యక్ష మ్యాచ్‌లను మెరుగ్గా చూసేందుకు ఇందులో స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. ఇంకా కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్, హెచ్‌డిఎమ్‌ఐ, యూఎస్‌బి పోర్టులు, స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉన్నాయి. 48W స్పీకర్లు డాల్బీ డిజిటల్ ప్లస్‌తో ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తాయి. వీటిలో ఉన్న హలోజియో అసిస్టెంట్ 10 కంటే ఎక్కువ భారతీయ భాషల్లో వాయిస్ కమాండ్‌లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే 10+ OTT యాప్‌ల నుంచి మీకు నచ్చిన వాటిని సిఫార్సు చేస్తుంది. వీటికి 1 సంవత్సరం వ్యారేంటి లభించనుంది.
ఈ థామ్సన్ టీవీలలో ఆమ్లాజిక్ చిప్‌సెట్ ఉంది. దీనికి 2GB ర్యామ్, 8GB స్టోరేజ్ కలిగి ఉంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. 50 అంగుళాల (50TJQ002) టీవీ రూ. 19,999కు, 55 అంగుళాల (55TJQ0032) టీవీ రూ. 25,999కు లభించనుంది. ఇక లాంచ్ ఆఫర్స్ కింద 3 నెలల జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అలాగే 1 నెల జియోగేమ్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఉంటుంది. యాక్సిస్, ఐసిఐసిఐ కార్డ్ యూజర్లకు కనీసం 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ టీవీలు సెప్టెంబర్ 23 నుండి అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
Lenovo IdeaPad Slim 3 Gen 11: లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 3 జెన్ 11 విడుదల.. FHD IR కెమెరా, Rapid Charge ఫీచర్స్ తో
-
Ram Charan : RC17 పై ‘పెద్ది’ ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
-
Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్‌తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్‌మ్యాన్’ గురి.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్‌ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!