NTV Telugu Site icon

Telangana Governament: తెలంగాణలో పనిచేయని పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు. అవేంటంటే?

Telangana Governament

Telangana Governament

Telangana Governament: సమాచార సాంకేతిక (ఐటీ) రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే తెలంగాణలో పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు పనిచేయట్లేదని, అప్‌డేట్‌ కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐటీ హబ్‌తో దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పుకుంటున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొనటం పట్ల కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ వంటి ప్రతిష్టాత్మక, ప్రపంచ స్థాయి సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు నిలయమైన తెలంగాణలో ఈ సమస్య ఉత్పన్నం కావటం, ఇంకా పరిష్కారం కాకపోవటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, అగ్రికల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌, కోపరేషన్‌ డిపార్ట్‌మెంట్‌, మిషన్‌ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ పావర్టీ ఇన్‌ మునిసిపల్‌ ఏరియాస్‌ (ఎంఈపీఎంఏ), టీఎస్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌తోపాటు మరెన్నో వెబ్‌సైట్లు అసలు అందుబాటులోనే లేవు. లింక్‌లు మాత్రమే డిస్‌ప్లే అవుతున్నాయి. వాటిలో ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ లేకపోవటం గమనార్హం. ఇదే విషయాన్ని తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్‌ పోరెడ్డి ప్రస్తావించారు.

Independence Celebrations: నేటి నుంచి స్వతంత్ర భారత వజ్రోత్సవాలు.. ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

”మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి వెబ్‌సైటే లేదు. గూగుల్‌ కూడా అదే చెబుతోంది. అయినా మీరు దాని కోసం ఒకటికి పది సార్లు వెతికారంటే మీరు మానసికంగా ఏదో జబ్బుతో బాధపడుతున్నట్లే లెక్క’ అని ఆయన కాస్త సెటైరికల్‌గా ట్వీట్‌ చేశారు. అవినాశ్‌ తోట అనే డిజైన్‌ ఇంజనీర్‌ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కిషోర్‌ పోరెడ్డి ట్వీట్‌కి రిప్లై ఇచ్చారు. ‘ప్రభుత్వ వెబ్‌సైట్ల పనితీరును మెరుగుపరిచేందుకు వరల్డ్స్‌ గ్రేటెస్ట్‌ ఐటీ మినిస్టర్‌ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు’ అని తప్పుపట్టారు. పరోక్షంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ని ఎద్దేవా చేశారు.

నిజం చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్ల అప్‌గ్రెడేషన్‌, మెయింటనెన్స్‌ గత నెల(జులై)లోనే పూర్తయింది. అయినప్పటికీ పలు వెబ్‌సైట్లు ఇంకా పనిచేయకపోవటం విచారకరం. వాస్తవానికి ఈ రోజుల్లో ప్రజలు చాలా మంది ఆన్‌లైన్‌ సేవల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇంట్లోనే కూర్చొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు. ముందుగా అధికారులకు ఫోన్‌ చేస్తారు. వాళ్లు ఫోన్‌లో అందుబాటులోకి రాకపోతే వాట్సాప్‌ ద్వారా కంటాక్ట్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులోనూ స్పందన లేకపోతే ఇ-మెయిల్‌ పెడుతున్నారు.

ఇలా వివిధ మార్గాల్లో ఇంటర్నెట్‌ని వాడుకుంటున్నారు. ఏదైనా డేటా కావాలంటే ఆయా వెబ్‌సైట్లను ఓపెన్‌ చేస్తున్నారు. వెబ్‌సైట్లు తెరుచుకున్నా వాటిలో తాజా సమాచారం లేకపోతే వేస్టే. అసలు కొన్ని సంస్థలకు వెబ్‌సైట్లే లేకపోవటం మరీ విడ్డూరం. పారదర్శక పాలనకు ఇలాంటి ఏర్పాట్లు ఎంతైనా అవసరం. మరీ ముఖ్యంగా అపొజిషన్‌ పార్టీలు ప్రభుత్వ నిర్ణయాలను(జీవోలను), ఆదాయ వ్యయాలను(బడ్జెట్‌ను) తెలుసుకోవటానికి వెబ్‌సైట్లనే ఆశ్రయిస్తాయి. తెలంగాణ బీజేపీ కూడా అదే చేసింది.

Show comments