6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- టెక్నో స్పార్క్ 50S 5G లాంచ్..
- 6.78 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్
- 6500mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
- వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా, ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
- మెరుగైన కనెక్టివిటీ కోసం 4×4 MIMO యాంటెన్నా టెక్నాలజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TECNO Spark 50s 5G Launched: బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో టెక్నో (TECNO) మరో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. TECNO Spark 50s 5G పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్లో 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. TECNO Spark 50s 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999 కాగా, 8GB + 128GB వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించారు. అక్టోబర్ 20 నుంచి దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో మాత్రమే ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 560 నిట్స్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. బర్గుండీ రెడ్, బ్రీజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ మొబైల్ లభిస్తుంది. ధూళి, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 Pro రేటింగ్ ఉంది. అలాగే MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ ప్రమాణాలను కూడా ఫోన్ అందుకుంటుంది. ఫోన్లో 6nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6GB/8GB LPDDR4X ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.
Also Read
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
- iQOO Pad Pro 8.8: iQOO Pad Pro 8.8 త్వరలో లాంచ్.. 9,020mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫీచర్లు!
- iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
మొబైల్ వెనుకవైపు f/1.85 అపెర్చర్‌తో 50MP ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరా అందించారు. ఈ ఫోన్లో 6500mAh బ్యాటరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి భారీ బ్యాటరీ ఉపయోగపడనుంది. ఇంకా ఇందులో తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ కోసం 4×4 MIMO యాంటెన్నా టెక్నాలజీని అందించింది. కంపెనీ ప్రకారం ఇది డౌన్లోడ్ వేగాన్ని 82% వరకు పెంచగలదు.
అలాగే UPI లావాదేవీలు వేగంగా పూర్తయ్యేందుకు UPS 3.0 టెక్నాలజీ ఉంది. సెల్యులార్ నెట్వర్క్ లేదా Wi-Fi అందుబాటులో లేని సమయంలో FreeLink ద్వారా 1.5 కిలోమీటర్ల పరిధిలో వాయిస్ కాల్స్, మెసేజ్‌లు, ఫొటోలను షేర్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.ఇంకా ఇందులో AI Noise Cancellation ద్వారా సాధారణ కాల్స్, వాట్సాప్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్‌లో వాయిస్ క్లారిటీని మెరుగుపరచవచ్చు. గూగుల్ జెమినీ ఇంటిగ్రేషన్, Circle to Search వంటి AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!