Site icon NTV Telugu

స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO POVA Slim 5G

Tecno Pova Slim 5g

Tecno Pova Slim 5g

TECNO POVA Slim 5G: టెక్నో (TECNO) తన కొత్త స్మార్ట్‌ఫోన్ POVA Slim 5G ను భారతదేశంలో సెప్టెంబర్ 4న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్‌గా, 3D కర్వ్‌డ్ డిస్ప్లేతో వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇటీవల ఇన్ఫినిక్స్ HOT 60 Pro+ 5.95మి.మీ. మందంతో వచ్చిన అత్యంత సన్నని కర్వ్‌డ్ స్క్రీన్ 4G ఫోన్ కాగా, దానికి అప్‌గ్రేడ్‌గా ఇది 5G విభాగంలో ప్రత్యేకతను అందించబోతోంది.

Hombale Films : అరుదైన ఘనత సాధించిన హోంబాలే ఫిలింస్

సన్నని డిజైన్‌కి మించి.. ఈ ఫోన్‌లో టెక్నో పలు ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. వీటిలో కెమెరా చుట్టూ అమర్చిన డైనమిక్ మూడ్ లైట్ డిజైన్ (LED లైట్లు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అదేవిధంగా, ఈ ఫోన్‌లో Ella AI అనే స్మార్ట్ అసిస్టెంట్ అందుబాటులో ఉంటుంది. ఇది ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్‌తో రైటింగ్ అసిస్టెన్స్ అందిస్తుంది. అలాగే, గూగుల్ Circle to Search ఫీచర్ ద్వారా స్మార్ట్ సెర్చ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచనుంది.

Perni Nani: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి ఫైర్!

అయితే, ఈ ఫోన్‌కు ఇతర టెక్నో, ఇన్ఫినిక్స్ ఫోన్లతో నెట్‌వర్క్ కమ్యూనికేషన్ ఫీచర్ అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు లభించిన రిపోర్టుల ప్రకారం 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉండనుంది. ఇది సన్నని డిజైన్ ఉన్నప్పటికీ, యూజర్లకు డే-లాంగ్ పనిచేసేందుకు బ్యాటరీ అందించగలదని చెబుతున్నారు. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

Exit mobile version