Site icon NTV Telugu

Apple AI Pin: షాకింగ్.. డిస్ప్లే లేని ఐఫోన్? స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు సిద్ధమైన యాపిల్!

Apple Ai Pin

Apple Ai Pin

Apple AI Pin: స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అతిపెద్ద మార్పుకు యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తుంది. యాపిల్ కొత్త AI పిన్‌ను తీసుకురాబోతున్నట్లు సమాచారం. దీనికి స్క్రీన్ అవసరం ఉండదని అంటున్నారు. నిజానికి ఇది స్మార్ట్‌ఫోన్ చరిత్రలో విప్లవాత్మకంగా అనిపిస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఇది నిజంగా తదుపరి ఐఫోన్ క్షణమా, లేదా హైప్‌తో పేలి నేలపై కూలిపోయే మరో సాంకేతిక ప్రయోగమా అనేది తెలియాల్సి ఉంది.

READ ALSO: BOB IT Recruitment 2026: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా ఉద్యోగాలు.. అర్హత, శాలరీ పూర్తి వివరాలివే

ప్రపంచ టెక్ మీడియాలో గత కొన్ని వారాలుగా యాపిల్ AI పిన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. యాపిల్ ధరించగలిగే టెక్ పరికరంపై పనిచేస్తున్నట్లు ఈ నివేదికలు సూచిస్తున్నాయి. గతంలో యాపిల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాహిర్ చౌదరి హ్యూమన్ AI పిన్‌ను ప్రారంభించారు. అది విఫలమైనప్పటికీ, HP దాని పేటెంట్‌ను పొందింది. AI పిన్ అంటే మీ ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం లేదు, మీరు టైప్ చేయడం, స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం మాట్లాడితే, ఆ మాటలను AI వింటుంది, అర్థం చేసుకుంటుంది, మీరు చెప్పిన పని చేస్తుంది. నిజానికి ఈ ఆలోచన భవిష్యత్తుకు సంబంధించినదిగా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి, దాని వెనుక ఉన్న సాంకేతికత, వ్యాపారం చాలా లోతైనవిగా టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

AI పిన్ అనే టెక్నాలజీ ప్రాథమికంగా వాయిస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ పరికరంలో కెమెరా, మైక్రోఫోన్, AI ప్రాసెసింగ్ ఉంటాయి. ఉదాహరణకు మీరు ఒక దుకాణాన్ని చూస్తే, ఆ స్థలం ఏమిటో AI మీకు తెలియజేస్తుంది. మీరు ఒక ప్రశ్న అడిగితే, దానికి ఈ AI మోడల్ సమాధానం ఇస్తుంది. అందుకే అలాంటి పరికరాలు కేవలం గాడ్జెట్‌లే కాకుండా డేటా సేకరణ యంత్రాలుగా కూడా మారుతాయి. ఈ డేటా ఎక్కడికి వెళుతుంది, అది ఎలా ప్రాసెస్ చేయబడుతుంది, అది వినియోగదారు గోప్యతపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న.

ఇక్కడే అసలు చర్చ ప్రారంభమవుతుంది. యాపిల్ చాలా సంవత్సరాలుగా గోప్యతను తన ప్రాథమిక ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఇప్పుడు అదే కంపెనీ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే కెమెరా, నిరంతరం వినే మైక్రోఫోన్‌ను కలిగి ఉండే AI పిన్ లాంటిదాన్ని ప్రవేశపెడితే, విశ్వసనీయ సమస్యలు తలెత్తడం అనివార్యంగా మారుతాయి. హ్యాండ్స్-ఫ్రీ AI కలని వినియోగదారులకు అందిస్తున్నప్పటికీ, అది వారిని నిరంతరం పర్యవేక్షించే గాడ్జెట్‌గా మారుతుందనే భయం కూడా ఉంది. AI పిన్ వంటి పరికరాలు ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాయని టెక్ పరిశ్రమలోని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు. బ్యాటరీ లైఫ్, నెట్‌వర్క్ ఆధారపడటం, AI లోపాలు, వంటిని దీనిలో తలెత్తు్న్న ప్రధాన ప్రశ్నలు. స్మార్ట్‌ఫోన్‌లు కెమెరా, ఇంటర్నెట్, యాప్‌లను ఒకే స్క్రీన్‌పై కనిపించేలా చేయడం ద్వారా అవి విజయవంతమయ్యాయి. కానీ ఇప్పుడు రెడీ అవుతున్న ఈ మోడల్‌లో స్క్రీన్‌లను తీసి వేస్తున్నారు, కానీ వినియోగదారుల అలవాట్లను మార్చడం కష్టతరం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వేళ ఇది విజయవంతమైతే, అది టెక్ పరిశ్రమలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. అలా జరగకపోతే అది గూగుల్ గ్లాస్, ఇతర విఫలమైన వస్తువుల జాబితాలో చేరుతుంది.

READ ALSO: Botsa Satyanarayana: దేవుడి పేరుతో రాజకీయాలు చేయవద్దు!

Exit mobile version