NTV Telugu Site icon

TCS: “వర్క్ ఫ్రం హోమ్” చేసే ఉద్యోగులకు టీసీఎస్ లాస్ట్ వార్నింగ్..

Tcs

Tcs

TCS: కోవిడ్ మహమ్మారి సమయంలో అన్ని టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్(WFH) అవకాశం ఇచ్చాయి. ప్రస్తుతం కోవిడ్ సమస్య సమిసిపోయి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం అన్ని టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. వర్క్ కల్చర్ మెరుగుపరిచేందుకు, భద్రత దృష్ట్యా ఉద్యోగులను ఆఫీసులకు రావాలని, లేకపోతే కెరీర్ పరిమితులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నాయి.

Read Also: Hamas: కాల్పులపై హమాస్ కొత్త ప్రతిపాదన! వర్క్‌వుట్ అయితే మాత్రం..!

ఇదిలా ఉంటే దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) కూడా వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. మార్చి నుంచి అందరూ ఆఫీసులకు రావాలని అల్టిమేటం జారీ చేసింది. ఇదే లాస్ట్ వార్నింగ్, అని, మార్చి నెలనే చివరి గడువు అని పేర్కొంది. ఉద్యోగులు ఎవరైనా దీన్ని పాటించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

వర్క్ కల్చర్, భద్రతా సమస్యలను ఆందోళనలుగా టీసీఎక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగా రావాలని సూత్రప్రాయమైన వైఖరి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు చివరి సందేశాన్ని పంపామని, వారు ఆఫీసులకు రాకుంటే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఆఫీసు నుంచి పనిచేసేవారి కన్నా వర్క్ ఫ్రం హోం చేసే వారు ఎక్కువగా సైబర్ అటాక్ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని హైలెట్ చేశారు.