NTV Telugu Site icon

TCL T6G QLED 4K TV: సినిమా హాల్ మాదిరి పెద్ద స్క్రీన్ స్మార్ట్‌ టీవీ.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Tcl Tv

Tcl Tv

TCL Released TCL T6G QLED 4K TVs in India: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘టీసీఎల్‌’కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తూ సత్తాచాటుతోంది. ఈ క్రమంలోనే 4K రిజల్యూషన్‌తో కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్‌లో వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ టీవీలో సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయ్. ఈ ఫీచర్ల ద్వారా మీరు థీయేటర్లలో చూస్తున్న అనుభూతిని పొందుతారు. టీసీఎల్‌ నుంచి రిలీజ్ అయిన కొత్త స్మార్ట్‌ టీవీ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చూద్దాం.

భారత మార్కెట్‌లో టీసీఎల్‌ T6G సిరీస్‌ స్మార్ట్‌ టీవీలు మూడు వేర్వేరు స్క్రీన్ సైజ్‌లలో అందుబాటులో ఉన్నాయి. 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ స్మార్ట్‌ టీవీలను టీసీఎల్‌ విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ టీవీలు ఈ కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్ సైజును బట్టి వీటి ధరలు వేరువేరుగా ఉన్నాయి. 43 ఇంచెస్ ధర రూ. 38,990లుగా ఉంది. 50 ఇంచెస్ టీవీ ధర రూ. 46,990 ఉండగా.. 55 ఇంచెస్ ధర 54,990గా ఉంది.

ఈ మూడు స్మార్ట్‌ టీవీలు 3840 × 2160 పిక్సెల్స్ రిజల్యూషన్, QLED డిస్‌ప్లే మరియు 300 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటాయి. వీటన్నింటికీ డాల్బీ విజన్, HDR 10 సపోర్ట్ ఉంది. ఈ టీవీలు AiPQ ఇంజిన్ 3.0, MEMC సాంకేతికతలను కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్‌ టీవీలు Google TV ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో రన్‌ అవుతాయి. ఇందులో 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంటుంది. T6G సిరీస్ టీవీలు 2GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్నాయి. వివిడ్ కలర్స్, మెరుగైన కాంట్రాస్ట్ వంటి చాలా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

TCL T6G QLED 4K Specifications:
# 4K రిజల్యూషన్
# అల్ట్రా-ప్రీమియం ఆఫర్ T6G AiPQ
# డాల్బీ విజన్ సపోర్ట్‌
# HDR10+, MEMCతో డిస్‌ప్లే బ్లర్
# DTS Virtual
# వర్చువలైజ్డ్ 3D సౌండ్
# Google వాచ్‌లిస్ట్
# Google ఫోటోలు
# గేమింగ్ ఫీచర్స్‌
# AMD ఫ్రీసింక్ టెక్నాలజీ
# QLED డిస్‌ప్లే
# గేమింగ్ సపోర్ట్
# షార్ట్‌కట్ కీలు