Talibans to ban TikTok, Pubg: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే 2 కోట్ల 34 లక్షల వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన తాలిబన్ ప్రభుత్వం మరో నెల రోజుల్లో టిక్‌టాక్‌ను, మూడు నెలల్లో పబ్‌జీ యాప్‌ని సైతం బ్యాన్ చేయనున్నట్లు ప్రకటించింది. దేశ అధికార పగ్గాలను తాలిబన్లు చేజిక్కించుకున్న ఈ ఏడాది కాలంలో అనైతిక కంటెంట్‌ను ప్రచురించాయనే ఆరోపణలతో ఈ నిషేధం విధించింది. అయినప్పటికీ ఆయా వెబ్‌సైట్లు కొత్త పేజీలతో పుట్టుకొస్తున్నాయని అసహనం ప్రదర్శించింది. కంటెంట్ నియంత్రణపై ఫేస్‌బుక్ సైతం తాలిబన్ అధికారులతో సహకరించట్లేదని అధికార వర్గాలు విమర్శించాయి. తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మీడియాపై ఏ స్థాయిలో ఆంక్షలు విధించిందో దీన్నిబట్టి అర్థమవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పెరగనున్న ‘ఓలా’ సెంటర్లు
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ల సంఖ్య 200కి పెరగనుంది. ప్రస్తుతం ఈ కేంద్రాలు 20 మాత్రమే ఉన్నాయి. ఓలా తయారుచేసిన ఇ-స్కూటర్ల సేల్స్ పడిపోయిన నేపథ్యంలో కూడా ఆ సంస్థ నుంచి ఇలాంటి విస్తరణ ప్రణాళిక వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ వాహనాల రంగంలో ఓలా ఇప్పుడు నాలుగో స్థానానికి పరిమితమైంది. మొదటి మూడు స్థానాల్లో హీరో, ఒకినవ, ఏథర్ ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగాన్ని ఓలా ఎలక్ట్రిక్ పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు లక్షా పాతిక వేలు
లాభం రూ.35 వేల కోట్లు
క్రూడాయిల్‌పై రష్యా ఇచ్చిన డిస్కౌంట్ల వల్ల మన దేశం 35 వేల కోట్ల రూపాయల వరకు లాభం పొందినట్లు సంబంధిత వర్గాల వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు రష్యా నుంచి ఇండియా చాలా తక్కువగా చమురును దిగుమతి చేసుకునేది. మన దేశ మొత్తం చమురు దిగుమతిలో రష్యా క్రూడాయిల్ శాతం ఒకటి కన్నా తక్కువే ఉండేది. యుద్ధం తర్వాత ఏకంగా 12 శాతానికి పెరిగింది. రష్యా నుంచి ఎక్కువగా చమురును కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా తర్వాత మనం రెండో స్థానంలో ఉండటం విశేషం.
