Sony BRAVIA 2M2 Series 4K Ultra HD Smart LED TV: సోనీ అభిమానులకు శుభవార్త.. ప్రీమియమ్ క్వాలిటీకి పేరుగాంచిన సోనీ కంపెనీ సంబంధించిన Sony BRAVIA 2M2 Series 65 అంగుళాల 4K Ultra HD Smart LED Google TV (K-65S25BM2) అమెజాన్‌లో భారీ ఆఫర్‌తో లభిస్తోంది. సాధారణంగా రూ.1,39,900 ధర గల ఈ హై-ఎండ్ స్మార్ట్ టీవీ ప్రస్తుతం 44% భారీ డిస్కౌంట్‌తో కేవలం ఋ 77,990కే అందుబాటులో ఉంది. అంటే వినియోగదారులు ఏకంగా రూ.61,910 వరకు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా.. అమెజాన్ పే లేటర్ ద్వారా No Cost EMI, కొన్ని క్రెడిట్ కార్డులపై మరో రూ.6,358 వరకు EMI సేవింగ్స్ ఉంచడం వినియోగదారులకు మరో అదనపు లాభం.
Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. 2 లక్షలు దాటేసిన సిల్వర్ ధర
ఈ టీవీలో 65 అంగుళాల 4K Ultra HD LED డిస్‌ప్లే ఉండి, 3840×2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో అద్భుతమైన విజువల్ అనుభవం అందిస్తుంది. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ ఆంగిల్ ఉండటం వల్ల ఎక్కడ నుంచైనా స్పష్టమైన చిత్రాన్ని వీక్షించవచ్చు. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఇది గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్యాస్ట్, వాచ్ లిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో వస్తుంది. వితోపాటు ఆపిల్ ఎయిర్ ప్లే 2, ఆపిల్ హోమ్ కిట్, అలెక్స సపోర్ట్ కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణ.
Samantha–Raj : ఫోటోలు వైరల్.. ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్మెంట్ .. !
పనితీరు పరంగా ఈ టీవీ గేమింగ్ కన్సోల్, ల్యాప్‌టాప్, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్పీకర్లు వంటి పరికరాలతో సులభంగా కనెక్ట్ అవుతుంది. HDMI, USB, ఈథర్నెట్, Wi-Fi వంటి కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ట్యూనర్‌గా DVB-T/T2 టెక్నాలజీ ఉపయోగించబడింది. ఆడియో సెక్షన్‌లో డాల్బీ ఆటమ్స్, డాల్బీ ఆడియో సపోర్ట్ అందించబడింది. టీవీలో 20W స్పీకర్లు ఉండి థియేటర్ తరహా సౌండ్ అనుభవాన్ని ఇస్తాయి. ఈ టీవీ 3 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో రావడం వల్ల తక్కువ విద్యుత్ వినియోగం కాస్త ఉంటుంది. ఇక టీవీ బాక్స్‌లో సోనీ LED టీవీ, AC పవర్ కార్డ్, రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీలు అందిస్తారు. వాల్ మౌంట్ లేదా టేబుల్ మౌంట్ రెండు విధాలుగా ఈ టీవీని అమర్చుకోవచ్చు. డిజైన్ విషయానికి వస్తే.. ఇది స్లిమ్ ప్రొఫైల్‌తో స్టైలిష్ లుక్ కలిగి ఉండి, లివింగ్ రూంలో ప్రీమియమ్ లుక్‌ను అందిస్తుంది.
