NTV Telugu Site icon

Smartphones: ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..

Smart Phones

Smart Phones

టెక్నాలజీ రాకెట్ కన్నా వేగంగా పెరుగుతుంది.. జనాలు కూడా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు.. మన జీవితంలో ఫోన్ ఒక భాగమైంది.. ఎంతగా ఫోన్ కు అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనేవరకు అవసరం ఉన్నా లేకున్నా కూడా చేతిలో ఉంటుంది.. ఫోన్‌ వచ్చిన కొత్తలో.. కేవలం మాట్లాడుకోవడం కోసమే వాడేవారు. మరి ఇప్పుడు.. బ్యాంక్‌ లవాదేవీలు, షాపింగ్‌, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం ఇలా దాదాపు అన్ని పనులు ఫోన్‌తోనే జరిగిపోతున్నాయి. అయితే చాలామందికి ఫోన్‌ వాడకంలో కంట్రోల్‌లో ఉండదు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఫోన్‌ వాడుతూనే ఉంటారు. సెల్‌ఫోన్‌ చేతిలో ఉంటే పక్కన ఉన్నవారితో అవసరమే ఉండదు. అసలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు.. ఫోన్ ను ఇలా వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..

ఫోన్ ను చూస్తూ గంటల తరబడి అలా ఉంటే కళ్ళకు ఎఫెక్ట్ కలుగుతుంది.. అదే పనిగా డిజిటల్‌ స్క్రీన్‌ చూడటం వల్ల కళ్లు పొడిబారడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, అలసట వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఫోన్‌ అతిగా వాడితే.. దృష్టి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఫోన్‌ అతిగా వాడితే.. నిద్రలేమి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. రాత్రి పడుకునేటప్పుడు ఫోన్‌ చూస్తే మొబైల్‌ స్క్రీన్‌ నుంచి వచ్చే బ్లూలైట్‌ మెలటోనిన్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఈ హార్మోన్‌ నిద్ర రావటంలో సహాయపడుతుంది.. ఫోన్ ను చూడటం వల్ల నిద్రలేమి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది..

చేతిని ఒకే కోణంలో ఉంచుతుంటారు. మోచేయి దగ్గర ఉండే అల్నార్‌ నరం ఒత్తిడికి గురౌతుంది. చేతికి తిమ్మిర్లు వస్తుంటాయి. మణికట్టు నుంచి మొదలు మోచేయి వరకూ నరం నొప్పి వస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలంటే ఫోన్‌ మాట్లాడేటప్పుడు ఎక్కువ సమయం ఒకే చేతితో పట్టుకోకూడదు.. అంతేకాదు మెడ, వెన్ను నొప్పి కూడా భాదిస్తుంది.. ఫోన్‌లో ఎక్కువసేపు టైప్ చేయడం, స్వైప్ చేయడం, పట్టుకోవడం వల్ల మన మణికట్టు, వేళ్లు, బ్రొటనవేళ్లలో స్నాయువు, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ వంటి రిపీట్‌ స్ట్రెయిన్ ఇంజరీస్‌ ఏర్పడవచ్చు.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది.. ఫోన్ ను చూస్తూ ఒకే చోట కూర్చోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు.. ఊబకాయం, ఇతర అనారోగ్యాల సమస్యలు ముప్పు పెరుగుతుంది.. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా రేడియెషన్ కు గురవుతారు..ఇన్ని సమస్యలు వస్తాయని తెలిసి కూడా ఫోన్ ఎక్కువగా వాడితే అంతే.. జాగ్రత్త..