Smart Glasses Privacy Risks: అమ్మాయిలూ జాగ్రత్త.. స్మార్ట్ గ్లాసెస్‌తో మహిళల ప్రైవసీ వీడియోలు రికార్డ్!

Smart Glasses Women Privacy

Smart Glasses Women Privacy

Smart Glasses Privacy Issue: టెక్నాలజీ రోజు రోజుకూ పెరుగుతోంది. టెక్నాలజీతోపాటు భయం సైతం పెరుగుతూ వస్తోంది. టెక్నాలజీకి చెందిన ఓ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేదో కాదు.. తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ గ్లాసెస్. చేతులతో నొక్కే పని లేకుండా ఫొటోలు తీయడం, ట్రాన్స్‌లేషన్, వాయిస్ అసిస్టెంట్ ఉపయోగించడం కోసం ఈ గ్లాసెస్ తయారయ్యాయి. కానీ.. ప్రస్తుతం ఈ గ్లాసెస్ మహిళల ప్రైవసీకి పెద్ద ముప్పుగా మారుతున్నాయి. స్టైల్‌ కోసం, కొత్త గ్యాడ్జెట్ అని కొందరు స్మార్ట్ గ్లాసెస్ వాడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం వీటిని తప్పు ఉద్దేశాలతో ఉపయోగిస్తున్నారు.

READ MORE: Foxtail Millet Kulfi: బాబోయ్ ట్రెండింగ్లో కొర్రల కుల్ఫీ.. ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ముఖ్యంగా తమను తాము “పిక్-అప్ ఆర్టిస్ట్‌లు” అని పిలుచుకునే కొందరు పురుషులు, మహిళలతో మాటలు కలిపి ఆ మాటల్ని రహస్యంగా రికార్డ్ చేసి కంటెంట్‌గా మార్చుకుంటున్నారు. బస్ స్టాప్‌లో, బీచ్‌లో, రోడ్డుపై, షాపింగ్ మాల్‌లో స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకుని మహిళలను తెలియకుండానే వారి వీడియో తీస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అవమానకరమైన కామెంట్లు, హ్యాష్‌ట్యాగ్‌లతో మరింత వేధిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. గత నెల ఇంగ్లాండ్‌లో ఒక మహిళకు ఇదే తరహా ఘటన ఎదురైంది. ఈ మహిళ ఓ వ్యక్తితో ఇటీవల ఒక హోటల్‌లో గడిపింది. ఆ వ్యక్తి ఆమెకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు తీశాడని ఆమె ఆరోపించింది. ఆ వీడియోలను ఆమెకే పంపించాడట. ఈ అంశంపై ఆ వనిత కోర్టుకు వెళ్లింది. ఈ విషయంపై కోర్టు ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఆ వ్యక్తిని జైలుకు పంపలేదు. ఇది ఒక్క కేసే కాదు. ఇలాంటి అనేక ఘటనలు మహిళల భద్రతపై పెద్ద ప్రశ్నలు వేస్తున్నాయి.

READ MORE: Hyderabad: రూ.3 వేల లోన్‌కే న్యూడ్ ఫోటోలతో బెదిరింపులు.. లోన్ యాప్ వేధింపులకు మరో వ్యక్తి బలి

అమెరికాలో మరో మహిళకు కూడా ఇలాగే జరిగింది. ఒక సూపర్‌మార్కెట్‌లో ఓ వ్యక్తి ఆమెతో సరదాగా మాట్లాడాడు. ఆమెను పొగిడాడి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియోతో సహా సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు గుర్తించింది. తన అనుమతి లేకుండా రికార్డ్ చేశారని తెలుసుకుని ఆమె సోషల్ మీడియాలో కన్నీళ్లతో వీడియో పెట్టింది. ఆ వీడియో చూసినవాళ్లందరూ షాక్‌కి గురయ్యారు. పబ్లిక్ ప్లేస్‌ల్లో ప్రైవసీ ఇప్పుడు మరింత ప్రమాదంలో పడుతోంది. మొబైల్ ఫోన్‌తో వీడియో తీస్తే కెమెరా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. కానీ స్మార్ట్ గ్లాసెస్‌లో కెమెరా కళ్లద్దాల్లోనే దాగి ఉంటుంది. ఎవరు వీడియో తీస్తున్నారో, ఎవరు కాదు అనేది గుర్తించడం చాలా కష్టం.

READ MORE: Naga Chaitanya : నాగచైతన్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్ళీ మొదలవుతున్న ‘దూత’ వేట!

కాగా.. భారత్‌లో స్మార్ట్ గ్లాసెస్ గురించి ప్రత్యేకంగా చెప్పే చట్టం లేదు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టంలోనూ పబ్లిక్ ప్లేస్‌లో వీడియో తీస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పాల్సిందే అనే నిబంధన లేదు. తన వీడియో ఎక్కడో రికార్డ్ అయిందని తెలుసుకునే హక్కు, లేదా దాన్ని తొలగించమని అడిగే స్పష్టమైన మార్గం లేదు. అంటే కేఫేలో, మెట్రోలో, పార్క్‌లో, ఆలయంలో ఎక్కడైనా గుర్తు తెలియని వ్యక్తులు మీ ఫొటోలు, వీడియోలు తీస్తుండొచ్చు. నిజం చెప్పాలంటే, మహిళల ప్రైవసీని పూర్తిగా కాపాడే సులభమైన పరిష్కారం ఇప్పట్లో లేదు. అందుకే మహిళలు మరింత అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. స్మార్ట్ గ్లాసెస్ ఎలా ఉంటాయో, అవి ఎలా గుర్తించాలో తెలుసుకోవడం ఇప్పుడు అవసరంగా మారింది.