Google introduces shop tab for rentals and purchases on Android TV: టెక్ దిగ్గజం ‘గూగుల్’.. కొత్త షాప్ ట్యాబ్‌ను పరిచయం చేసింది. షాప్ ట్యాబ్‌ను బుధవారం నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో అందుబాటులోకి తెచ్చింది. కొనుగోలు లేదా అద్దెకు అందుబాటులో ఉన్న శీర్షికలను బ్రౌజ్ చేయడానికి ఈ షాప్ ట్యాబ్ వినియోగదారులకు అనుమతిని ఇస్తుంది. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఈ ఫీచర్ కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూఎస్‌లోని అన్ని ఆండ్రాయిడ్ టీవీ పరికరాలలో ఈ ఫీచర్‌ని కంపెనీ అందుబాటులోకి తెచ్చింది.
ఈ షాప్ ట్యాబ్ కొత్త శీర్షికలను అన్వేషించడానికి అనుమతిస్తుంది. ఇతర స్ట్రీమింగ్ సర్వీస్‌లలో ఇంకా అందుబాటులో లేని కొత్త సినిమా కోసం మీరు వెతుకుతున్నా? లేదా సబ్‌స్క్రిప్షన్ లేకుండా సినిమాని కొనుగోలు చేయాలనుకున్నా? ఈ షాప్ ట్యాబ్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. షాప్ ట్యాబ్ ద్వారా మీరు కొత్త సినిమాలను కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు. అలాగే కొత్త లైబ్రరీని యాక్సెస్ చేయవచ్చు.
Also Read: Hair Care Tips For Men: వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. మీ జుట్టు మెరిసిపోవడం పక్కా!
యూట్యూబ్, గూగుల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ మరియు గూగుల్ టీవీ మొబైల్ యాప్‌లో చేసిన కొనుగోళ్లతో సహా మీ గూగుల్ ఖాతాతో చేసిన అన్ని కొనుగోళ్లు మీ లైబ్రరీలో (లైబ్రరీ ట్యాబ్) సేవ్ చేయబడతాయి. మీరు సినిమా చూసేందుకు షాప్ ట్యాబ్‌ని సందర్శించవచ్చు. మీ ఫోన్ లేదా టాబ్లెట్‌లోని గూగుల్ టీవీ మొబైల్ యాప్‌ని ఉపయోగించి మీరు కొనుగోలు చేసిన కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కొత్త షాప్ ట్యాబ్ రాబోయే కొద్ది వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ టీవీ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది. గూగుల్ ఆండ్రాయిడ్ 14ని ఆండ్రాయిడ్ టీవీ పరికరాలకు విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఓ వేదిక ప్రకారం.. బీటా వెర్షన్ వినియోగదారులు టెక్స్ట్ స్కేలింగ్, బోల్డ్ టెక్స్ట్ మరియు కలర్ డిస్క్రిప్షన్ వంటి టాప్-లెవల్ యాక్సెసిబిలిటీ మెను వంటి ఫీచర్‌లను పొందుతారని తెలుస్తోంది.
Also Read: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!