Sarvam AI: ఏఐ రంగంలో భారత్ సంచలనం.. చాట్‌జీపీటీ, జెమినీలను వెనక్కి నెట్టిన భారత్ ఏఐ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarvam AI: భారత్ మారుతోంది. ఒకప్పుడు ఏఐ అంటే అమెరికా, చైనా పేర్లు గుర్తొచ్చేవి. గూగుల్, చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ వంటి ఏఐ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ.. ప్రస్తుతం ఈ జాబితాలో భారత్ చేరింది. బెంగళూరు వేదికగా కొత్త స్టార్టప్ సర్వం ఏఐ (Sarvam AI) ప్రారంభమైంది. మొదట్లో ఈ సంస్థను చాలామంది ఒకే కోణంలో చూశారు. ఈ ఏఐ కేవలం భారతీయ భాషలకే పరిమితమవుతుందని భావించారు. కానీ కాలం మారింది. ఇప్పుడు అదే సంస్థ ప్రపంచ స్థాయి ఏఐ మోడళ్లతో పోటీ పడుతూ కొన్ని చోట్ల వాటిని మించిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సర్వం ఏఐ తయారు చేసిన Sarvam Vision అనే ఏఐ టూల్ తాజాగా పెద్ద చర్చకు కారణమైంది. ఇది ముఖ్యంగా డాక్యుమెంట్లను చదివి అర్థం చేసుకునే సామర్థ్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తోంది. మనకు స్కాన్ చేసిన పేపర్లు, ఫారమ్‌లు, పట్టికలు, లెక్కల ఫార్మూలాలు ఏఐలకు తలనొప్పిగా మారుతుంది. కానీ.. Sarvam Vision మాత్రం ఇలాంటి క్లిష్టమైన డాక్యుమెంట్లను ఈజీగా చదివేస్తోంది.
READ MORE: Samsung Galaxy F70e 5G: 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీతో.. Samsung Galaxy F70e 5G లాంచ్
Also Read
- ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- OnePlus N6x 5G: 7000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ అత్యంత చౌకైన 5G ఫోన్ లాంచ్.. ఈ ఫోన్లో ఇవే హైలైట్స్!
- 24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
- 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
ప్రపంచవ్యాప్తంగా పేరున్న OmniDocBench v1.5 అనే పరీక్షలో ఈ టూల్‌ను పరీక్షించారు. ఇది ఏఐ ఒక డాక్యుమెంట్‌ను ఎంత బాగా అర్థం చేసుకుంటుందో ఈ పరీక్షలో తేటతెల్లమైంది. అందులో Sarvam Vision 93.28 శాతం ఖచ్చితత్వంతో ఫలితం సాధించింది. ఇదే పరీక్షలో జెమినీ, చాట్‌జీపీటీ లాంటి పెద్ద మోడళ్లు సైతం పోటీ పడ్డాయి. కానీ ఈసారి Sarvam Vision ముందు అవి వెనుకబడ్డాయి. ఈ విషయం ఏఐ ప్రపంచంలో పెద్దగా చర్చకు వచ్చింది. ఈ విజయాన్ని సర్వం ఏఐ సహ-వ్యవస్థాపకుడు ప్రత్యుష్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నిపుణులు “ఇది నిజంగా గొప్ప విషయం” అని ప్రశంసించారు. ఇప్పటివరకు భారతీయ భాషలకే పరిమితమని విమర్శించినవాళ్లే ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. టెక్ కామెంటేటర్ డీడీ దాస్ సైతం ఇదే విషయం చెప్పారు. “సర్వం ఏఐ తయారు చేసిన OCR, స్పీచ్ మోడళ్లు చాలా బలంగా ఉన్నాయి. గ్లోబల్ ఏఐ పట్టించుకోని ఖాళీని ఇవి పూరిస్తున్నాయి” అని ఆయన పేర్కొన్నారు. ఒక సంవత్సరం క్రితం తాను సర్వం ఏఐ గురించి తప్పుగా అంచనా వేసానని ఒప్పుకున్నారు. కేవలం నిపుణులే కాదు, సాధారణ యూజర్లు కూడా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. “కొద్ది రోజుల క్రితమే ఈ ఏఐని వాడాను, నిజంగా అద్భుతంగా పనిచేస్తోంది” అని ఒక యూజర్ రాశాడు. ఇలా ఒక్కో అభిప్రాయం సర్వం ఏఐపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.
READ MORE: CM Chandrababu: జగన్ ఇంటి దగ్గర హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
OnePlus N6x 5G: 7000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ అత్యంత చౌకైన 5G ఫోన్ లాంచ్.. ఈ ఫోన్లో ఇవే హైలైట్స్!
-
India’s Most Powerful Women 2026: దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు ఎవరు?.. ఏకంగా రూ.39 లక్షల కోట్ల ఆస్తులు!
-
Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 31 వరకే ఛాన్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!
-
505Km రేంజ్, AI క్యాబిన్, 25 స్పీకర్లతో ఫ్యామిలీల కోసం Xiaomi SkyNomad Series ఎలక్ట్రిక్ SUVలు లాంచ్..!