Samsung Galaxy Z Flip7 Olympic Edition: శాంసంగ్ అధికారికంగా గ్యాలక్సీ Z ఫ్లిప్7 ఒలింపిక్ ఎడిషన్ (Galaxy Z Flip7 Olympic Edition)ను ప్రకటించింది. ఈ ప్రత్యేక స్మార్ట్‌ఫోన్‌ను మిలానో కార్టినా 2026 ఒలింపిక్, పారాలింపిక్ వింటర్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వరల్డ్‌వైడ్ ఒలింపిక్, పారాలింపిక్ పార్ట్నర్‌గా ఉన్న శాంసంగ్.. దాదాపు 90 దేశాల నుంచి 3,800 మంది క్రీడాకారులకు ఈ మొబైల్ ను ఉచితంగా అందించనుంది.
ఒలింపిక్ విలేజ్‌లో ఉన్న సమయంలో క్రీడాకారులకు కమ్యూనికేషన్, రోజువారీ అవసరాలు, అలాగే తమ అనుభవాలను సులభంగా డాక్యుమెంట్ చేసుకునేలా చేయడం ఈ ప్రత్యేక ఎడిషన్ ఉద్దేశ్యం. ఇది ప్రత్యేక డిజైన్ తో రూపొందింది. ఇటలీ హోస్ట్ నేషన్‌ను సూచించే “ఇటాలియన్ అజ్యూర్” (Italian azure) భావనకు అనుగుణంగా బ్లూ బ్యాక్ గ్లాస్‌ను ఉపయోగించారు. దీనికి గోల్డ్ మెటల్ ఫ్రేమ్ జోడించడంతో పోడియం విజయాన్ని సూచించే ప్రత్యేక లుక్ వచ్చింది.
MIW vs RCBW: WPLలో చరిత్ర సృష్టించిన నాట్ స్కివర్ బ్రంట్.. RCBపై ముంబై ఇండియన్స్ విజయం!
ప్యాకేజీలో బ్లూ సర్క్యులర్ మ్యాగ్నెట్, గోల్డ్ లారెల్ లీఫ్ డిజైన్‌తో కూడిన స్పెషల్ క్లియర్ కేస్ కూడా ఉంది. సాఫ్ట్‌వేర్ పరంగా, స్కేటింగ్ బ్లేడ్స్ ఐస్ మధ్య ఇంటరాక్షన్‌ను సూచించే కస్టమ్ వాల్‌పేపర్లు అందించారు. హార్డ్‌వేర్ పరంగా ఇది స్టాండర్డ్ గ్యాలక్సీ Z ఫ్లిప్7తో సమానంగా ఉంటుంది. ఎడ్జ్-టు-ఎడ్జ్ ఫ్లెక్స్ విండో, ఫోల్డబుల్ డిజైన్, అలాగే 50MP వైడ్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఇందులో ఉన్నాయి.
ఈ ఒలింపిక్ ఎడిషన్‌లో క్రీడాకారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక Galaxy AI టూల్స్‌ను అందించారు. ఇందులో నెట్‌వర్క్ అవసరం లేకుండా రియల్‌టైమ్ అనువాదం చేసే టూల్ ఇంటర్ప్రెటేర్ (Interpreter)ను ఉపయోగించారు. ఈ ఫీచర్ పర్వత ప్రాంతాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇంకా రోజువారీ రిమైండర్లు, క్యాలెండర్ ఈవెంట్స్, ఫిట్‌నెస్ అప్‌డేట్స్‌ను ఒకే చోట చూపించేందుకు నౌ బ్రీఫ్ (Now Brief) ను అమర్చారు.
వీటితోపాటు AI ఆధారిత ఫోటో ఎడిటింగ్‌తో ఆబ్జెక్ట్ మార్పులు, బ్యాక్‌గ్రౌండ్ అడ్జస్ట్‌మెంట్స్ ఫోటో అసిస్ట్ (Photo Assist) ద్వారా చేయవచ్చు. ఈ ఎడిషన్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఫీచర్గా.. ఫ్రంట్, రియర్ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసి, క్రీడాకారుల రియాక్షన్‌తో పాటు పరిసరాలను కూడా క్యాప్చర్ చేయవచ్చు. డ్యూయల్ రికార్డింగ్ (Dual Recording) ద్వారా ఈ ఫీచర్లను పొందవచ్చు.
మారుతి సంచలనం.. బూట్ స్పేస్ సమస్యకు చెక్.. Maruti Brezza CNG వచ్చేస్తోంది!
గ్యాలక్సీ Z ఫ్లిప్7 ఒలింపిక్ ఎడిషన్ “Victory Selfie” ప్రోగ్రామ్‌లో కీలక పాత్ర పోషించనుంది. మిలానో కార్టినా 2026 వింటర్ ఒలింపిక్స్‌లో తొలిసారి ఈ ప్రోగ్రామ్‌ను టీమ్ స్పోర్ట్స్‌కూ విస్తరించారు. మెడల్ గెలిచిన క్రీడాకారులు నేరుగా పోడియం నుంచే సెల్ఫీలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాంసంగ్ “విక్టరీ ప్రొఫైల్” (Victory Profile) ప్రాజెక్ట్‌ను కూడా పరిచయం చేసింది. Galaxy S25 అల్ట్రాతో ఎంపిక చేసిన జాతీయ ఒలింపిక్ కమిటీల క్రీడాకారుల వ్యక్తిగత కథలను పోర్ట్రెయిట్ల రూపంలో చిత్రీకరిస్తారు.
ఈ Galaxy Z Flip7 Olympic Edition డివైస్‌లో క్రీడాకారుల రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే కీలక సేవలను ఇన్‌స్టాల్ చేసి అందిస్తున్నారు. ఇందులో 100GB ఉచిత 5G eSIM ఉండటం వల్ల ఒలింపిక్ విలేజ్‌తో పాటు వివిధ వేదికల్లో వేగవంతమైన కనెక్టివిటీ అందుబాటులో ఉంటుంది. Galaxy Athlete Card అనే డిజిటల్ ప్రొఫైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులు పరస్పరం కనెక్ట్ కావడం, తమ వివరాలను పంచుకోవడం సులభమవుతుంది. అలాగే Samsung వాలెట్ లో కోకా-కోలా ఫ్రీ బెవరేజ్ కీ వంటి అవసరమైన డిజిటల్ పాసులు అందుబాటులో ఉండటం వల్ల రోజువారీ లాజిస్టిక్స్ మరింత సౌకర్యవంతంగా మారతాయి. దీనితో పాటు Athlete365 యాప్ను Now Briefతో ఇంటిగ్రేట్ చేసి అందించడం ద్వారా పోటీ వార్తలు, ఒలింపిక్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్, అలాగే మెంటల్ హెల్త్ సపోర్ట్ వంటి సమాచారాన్ని క్రీడాకారులు ఒకే చోట పొందగలుగుతారు.
100x జూమ్ నుంచి 6200mAh బ్యాటరీ వరకు.. స్మార్ట్ ధరలో ఫ్లాగ్‌షిప్ అనుభవం.. నేడే vivo X200T లాంచ్..!
ఈ మొబైల్ పంపిణీ జనవరి 30 నుంచి ప్రారంభం కానుంది. ఆరు హోస్ట్ నగరాల్లోని ఒలింపిక్ విలేజ్‌లలో క్రీడాకారులకు ఈ ఫోన్లు అందజేస్తారు. అలాగే ఆన్-సైట్ ఓపెన్ స్టేషన్స్ ఏర్పాటు చేసి, టెక్నికల్ సపోర్ట్, డేటా ట్రాన్స్‌ఫర్, డివైస్ యాక్టివేషన్ సేవలను అందించనుంది.
