IP68 రేటింగ్, ప్రీమియం ఫీచర్లతో Samsung Galaxy Tab S11, S11 Ultra లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
- IP68 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6E/7, 5G, 4 స్పీకర్లు
- Tab S11 స్పెక్స్ – 12GB RAM, 128/256/512GB స్టోరేజ్
- 13MP రియర్, 12MP ఫ్రంట్, 8,400mAh బ్యాటరీ
- Tab S11 Ultra స్పెక్స్ – 12/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్
- 13MP+8MP UW రియర్, 12MP ఫ్రంట్, 11,600mAh బ్యాటరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy Tab S11, S11 Ultra: శాంసంగ్ కొత్తగా గెలాక్సీ ట్యాబ్ S11 సిరీస్‌ను అధికారికంగా ఆన్‌లైన్ ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఇందులో గెలాక్సీ ట్యాబ్ S11, గెలాక్సీ ట్యాబ్ S11 అల్ట్రా రెండు మోడల్స్ లభిస్తున్నాయి. ఇవి వరుసగా 11 అంగుళాలు, 14.6 అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేలు ఉంటాయి. ఈ రెండూ MediaTek Dimensity 9400+ 3nm ప్రాసెసర్ తో పనిచేస్తాయి. ఇది గత మోడల్ కంటే 33% NPU, 24% CPU, 27% GPU పెర్ఫార్మెన్స్ మెరుగుదలను అందించనున్నాయి.
అత్యంత సన్నగా రూపొందించిన Tab S11 Ultra కేవలం 5.1mm మందంతో వస్తుండగా, 5.2mm బార్డర్లతో ప్రీమియం ఫినిష్ అందిస్తుంది. ఇందులో Dynamic AMOLED 2X డిస్‌ప్లేలు గరిష్టంగా 1600 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తాయి. ఇక ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ కొత్త S Pen. ఇది కోన్ షేప్ పెన్‌టిప్‌తో మెరుగైన కంట్రోల్ ఇస్తుంది. అలాగే హెక్సాగనల్ డిజైన్ చేతిలో సరిపడేలా రూపొందించబడింది. ఇది Quick Tools డ్రాయింగ్ లేదా ఎడిటింగ్ సమయంలో వెంటనే ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తుంది. అలాగే, స్టిక్కీ నోట్ ద్వారా వేర్వేరు యాప్‌లకు మారాల్సిన అవసరం లేకుండా నోట్స్ రాయవచ్చు.
Also Read
- Boltt Ace 5G : విడుదలైన తర్వాత రోజే మొత్తం Sold Out.. మరో కొత్త తేదీ ప్రకటన.. రూ.9,999లకే 5జీ మొబైల్..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్‌టాప్‌లు భారత్‌లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్‌ప్లే
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ఇక కొత్త Samsung DeX Extended Mode ద్వారా Tab S11 సిరీస్‌ను బయట మానిటర్‌కు కనెక్ట్ చేస్తే.. డ్యూయల్ స్క్రీన్ సెటప్ లాగా పని చేస్తుంది. ఒకేసారి రెండు స్క్రీన్‌లపై DeX నడుస్తూ, వర్క్‌స్పేస్‌ను నాలుగు వేర్వేరు కస్టమైజ్డ్ సెట్ చేసుకోవచ్చు. Tab S11లో 11 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 12GB RAM, 128GB/256GB/512GB స్టోరేజ్ ఆప్షన్లు, 13MP రియర్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా, 8,400mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్) లభిస్తాయి. ఇక Tab S11 Ultraలో 14.6 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 12GB/16GB RAM, 256GB/512GB/1TB స్టోరేజ్ వేరియంట్లు, 13MP + 8MP అల్ట్రా వైడ్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 12MP ఫ్రంట్ కెమెరా, 11,600mAh బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉన్నాయి.
ఈ రెండు టాబ్లెట్‌లు Android 16తో పాటు One UI 8పై రన్ అవుతాయి. అదనంగా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6E/7, 5G సపోర్ట్, 4 స్పీకర్ల వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇక ధరల విషయానికి వస్తే, Galaxy Tab S11 Wi-Fi మోడల్ ధరలు USD 799.99 (రూ.70,510) నుంచి ప్రారంభమవుతాయి. 5G మోడల్ ధర EUR 1049 (రూ.1,07,725) నుంచి మొదలవుతుంది. Tab S11 Ultra Wi-Fi మోడల్ ధర USD 1,199.99 (రూ.1,05,770) నుంచి ప్రారంభమవుతుండగా, 5G మోడల్ EUR 1489 (సుమారు రూ.1,52,814) నుంచి లభిస్తుంది. ఈ రెండు టాబ్లెట్‌లు ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. ఐయితే, భారత్‌లో ముందస్తు రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
7 ఏళ్ల అప్‌డేట్ హామీ, Exynos 2400 చిప్‌సెట్‌తో Samsung Galaxy S25 FE వచ్చేసిందోచ్..!
తాజావార్తలు
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
-
Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
-
Harish Rao : మంత్రి పొంగులేటివన్నీ అబద్ధాల ప్రవాహాలే
-
Off The Record : ఏపీ కూటమిలో సీట్ల సంకటం! టీడీపీకి షాక్ ఇస్తున్న జనసేన, బీజేపీ?
-
Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!