Site icon NTV Telugu

Samsung Galaxy S26 Ultra Launch: 200MP కెమెరా, 5400mAh బ్యాటరీ.. భారీ అప్‌గ్రేడ్స్‌తో గెలాక్సీ ఎస్26 అల్ట్రా!

Samsung Galaxy S26 Ultra Launch

Samsung Galaxy S26 Ultra Launch

Samsung Galaxy S26 Ultra Launch and Price in India: జనవరి వచ్చిందంటే శాంసంగ్ అభిమానులు, టెక్ ప్రియులు కొత్త గెలాక్సీ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ప్రతి ఏడాది ఆరంభంలో శాంసంగ్ తన కొత్త ఎస్ సిరీస్‌ను పరిచయం చేస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం శాంసంగ్ గెలాక్సీ ఎస్26 (Samsung Galaxy S26), శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. పలు రిపోర్టుల ప్రకారం.. ఎస్26 ఫోన్‌ల లాంచ్‌కి ఇంకా కొన్ని వారాలే మిగిలి ఉంది. 2026 ఫిబ్రవరి చివరి వారంలో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్26 లాంచ్‌కు ముందే ఇంటర్నెట్‌లో లీక్స్‌, రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. M14 ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ జెనెరేషన్ 5 చిప్‌సెట్ వంటి అప్‌గ్రేడ్స్‌తో అల్ట్రా రానుంది. శక్తివంతమైన ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌గా ఈ సిరీస్ రానున్నట్లు సమాచారం. డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా ఈ ఫోన్‌లో భారీ మార్పులు ఉండనున్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 25న శాంసంగ్ తన వార్షిక గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ (Galaxy Unpacked 2026)ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఇతర యాక్సెసరీస్‌ను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది. అదే రోజున అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో గెలాక్సీ ఎస్26 సిరీస్‌ను ఆవిష్కరిస్తారు. మార్చి ప్రారంభంలో సేల్స్ మొదలయ్యే అవకాశముంది. మార్చి మధ్యలో అల్ట్రా మార్కెట్లోకి రావచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో M14 ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. గత తరం M13 ఓఎల్‌ఈడీతో పోలిస్తే 20–30 శాతం ఎక్కువ పవర్ ఎఫిషియెన్సీ ఇస్తుందని చెబుతున్నారు. ఈ ప్యానెల్‌ను iQOO 15లో ఉంది. డిజైన్ పరంగా ఫోన్ కొంచెం సన్నగా ఉండే అవకాశం ఉంది. సుమారు 7.9mm మందం ఉండవచ్చని లీక్స్ చెబుతున్నాయి. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్ జెనెరేషన్ 5 చిప్‌సెట్ ఉండనుంది. LPDDR5X ర్యామ్ (10.7Gbps వరకు) ఉండే అవకాశం ఉంది. ఇది ఇమేజ్ ప్రాసెసింగ్‌లో మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ ఫోన్ మెరుగైన సెన్సార్లు, సామర్థ్యాలతో 200MP వెనుక కెమెరాను కలిగి ఉంటుంది. ఎపర్చర్‌ కారణంగా తక్కువ కాంతిలో కూడా మెరుగైన ఫోటో, వీడియోలు తీసుకోవచ్చు.

Also Read: Virat Kohli Record: జనవరి 11 కోహ్లీకి చాలా ప్రత్యేకం.. సచిన్, సంగక్కర ప్రపంచ రికార్డులు బ్రేక్ అయ్యేనా?

చాలా ఏళ్ల తర్వాత బ్యాటరీలో కూడా శాంసంగ్ కంపెనీ అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో 5,100mAh నుంచి 5,400mAh వరకు బ్యాటరీ ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకు 45Wకే పరిమితమైన ఛార్జింగ్ స్పీడ్‌ను పెంచుతూ.. ఈసారి 60W వైర్డ్ ఛార్జింగ్ అందించే అవకాశం ఉంది. ల్యాబ్ టెస్టుల్లో ఈ ఫోన్ 30 నిమిషాల్లో 0 నుంచి 75 శాతం ఛార్జ్ అయిందట. ఇండియాలో ధర విషయంలో ఇంకా స్పష్టత లేదు. గతేడాది ఎస్25 అల్ట్రా రూ.1,29,999గా లాంచ్ అయింది. అమెరికా వంటి కీలక మార్కెట్లలో ధరలను స్థిరంగా ఉంచాలని శాంసంగ్ భావిస్తున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే గ్లోబల్ మెమరీ చిప్ కొరత కారణంగా కాంపోనెంట్ ధరలు పెరిగాయని శాంసంగ్ ఉన్నతాధికారులు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్స్‌తో ఈ ఫ్లాగ్‌షిప్ మార్కెట్లోకి రానుంది.

Exit mobile version