Site icon NTV Telugu

Galaxy S26 Series Price: ఇండియన్ మార్కెట్‌లో గెలాక్సీ S26 సిరీస్ ధరలు ఇవే.. టాప్ ఎండ్‌కు మతిపోయే ప్రైస్!

Galaxy S26 Series Price

Galaxy S26 Series Price

Samsung Galaxy S26 India Price: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ‘శాంసంగ్’.. తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన ‘గెలాక్సీ S26’ సిరీస్‌ భారత మార్కెట్ ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో గెలాక్సీ S26 అల్ట్రా, గెలాక్సీ S26 ప్లస్, గెలాక్సీ S26 మోడల్స్‌తో పాటు కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు కూడా విడుదల చేయడం విశేషం. అత్యాధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరు, హైఎండ్ కెమెరా సెటప్‌తో ఈ సిరీస్ టెక్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. ప్రీమియం సెగ్మెంట్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఈ డివైస్‌లు.. అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ప్రైవసీ డిస్‌ప్లే’ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది.

గెలాక్సీ S26 అల్ట్రా మోడల్‌లో 256GB వేరియంట్ ధర రూ.1,39,999 కాగా.. 512GB వేరియంట్ ధర రూ.1,59,999గా కంపెనీ ప్రకటించింది. టాప్ ఎండ్ 16GB + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,89,999గా ఉంది. గెలాక్సీ S26 ప్లస్ 256GB వేరియంట్ రూ.1,19,999 కాగా.. 512GB వేరియంట్ రూ.1,39,999. సాధారణ గెలాక్సీ S26 మోడల్ 256GB ధర రూ.87,999 కాగా, 512GB వేరియంట్ ధర రూ.1,07,999గా ఉంది.

Also Read: Samsung Galaxy S26 Ultra Launch: ‘గెలాక్సీ ఎస్26 అల్ట్రా’ వచ్చేసింది.. ‘ప్రైవసీ డిస్‌ప్లే’తో కొత్త బెంచ్‌మార్క్!

గెలాక్సీ బడ్స్ 4 ధర రూ.16,999గా ఉండగా, బడ్స్ 4 ప్రో ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. 256GB ధరకు 512GB వేరియంట్‌ను పొందే అవకాశం, బండిల్‌గా బడ్స్ 4 కొనుగోలు చేస్తే రూ. 3,500 తగ్గింపు, విడిగా కొనుగోలు చేసినా రూ.2,000 వరకు డిస్కౌంట్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ డెలివరీలు మార్చి 6 నుంచి ప్రారంభం కానున్నాయి.

Exit mobile version