Site icon NTV Telugu

ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు మరింత అఫోర్డబుల్ ధరలో.. Samsung Galaxy S25 Ultra 5Gపై రూ.20,000 డిస్కౌంట్..!

Samsung Galaxy S25 Ultra 5g

Samsung Galaxy S25 Ultra 5g

Samsung Galaxy S25 Ultra 5G: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన శాంసంగ్ గాలక్సీ S25 అల్ట్రా 5G (Samsung Galaxy S25 Ultra 5G) ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందుబాటులోకి వచ్చింది. టాప్ ఎండ్ స్పెసిఫికేషన్లు, ప్రీమియం డిజైన్, అత్యాధునిక కెమెరా సెటప్‌తో వచ్చే ఈ ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ.1,29,999గా ఉండగా.. ప్రస్తుతం రూ.1,09,998కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.20,000 (15%) ధర తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్‌తో ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే నెలకు కేవలం రూ.3,868 నుంచి మొదలు EMI సౌకర్యంతో ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు

ఈ ఫోన్ 6.9 అంగుళాల Dynamic AMOLED 2X డిస్‌ప్లేతో వస్తుంది. Quad HD+ (3120 × 1440 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. సుమారు 218 గ్రాముల బరువుతో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇందులో Snapdragon 8 Elite for Galaxy ప్రాసెసర్ ఉంది. Octa-core CPU, గరిష్టంగా 4.47GHz క్లాక్ స్పీడ్‌తో హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. ఫోన్ Android 15 ఆధారిత One UI 7.0తో వస్తుంది. ముఖ్యంగా 7 OS అప్డేట్స్ హామీ ఇవ్వడం దీన్ని లాంగ్‌టర్మ్ యూజ్‌కు అనువుగా మారుస్తుంది.

Best Free AI Tools: నేటి డిజిటల్ యుగంలో దూసుకెళ్లాలంటే 5 బెస్ట్ AI టూల్స్ మీకోసం..!

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 200MP క్వాడ్ కెమెరా సెటప్. 200MP + 50MP + 50MP + 10MP కెమెరాలతో ఫోటోగ్రఫీని మరో స్థాయికి తీసుకెళ్తుంది. 100X డిజిటల్ జూమ్, నైట్ మోడ్, ప్రో వీడియో, స్లో మోషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీడియో రికార్డింగ్‌లో కూడా ఇది టాప్ 8K UHD వీడియోలు (30fps) రికార్డ్ చేయవచ్చు. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ లాంగ్ లాస్టింగ్ బ్యాకప్ ఇస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సర్, జైరో, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సర్ వంటి అన్ని అవసరమైన సెన్సర్లు ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సపోర్ట్, 12GB RAM, 256GB స్టోరేజ్‌తో ఇది ఒక కంప్లీట్ ఫ్లాగ్‌షిప్ ప్యాకేజీగా నిలుస్తుంది.

Exit mobile version