ప్రముఖ మొబైల్ కంపెనీ శాంసంగ్ గేలాక్సీ నుంచి మరో రెండు సిరీస్ ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేసింది.. గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.. ఈ సిరీస్ ఫోన్ల గురించి ఆన్ లైన్ లో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.. ఈ మేరకు ఈ ఫోన్లను జనవరి 17 న మార్కెట్ లోకి విడుదల చెయ్యనున్నారు.. శాంసంగ్ S24 సిరీస్ లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇటీవలే గెలాక్సీ ఎస్24, గెలాక్సీ ఎస్24 ప్లస్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రెండర్‌లు పూర్తి స్పెసిఫికేషన్‌లతో పాటు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
ఈ కంపెనీ శాంసంగ్ గెలాక్సీ ఎస్24 పస్ల్, గెలాక్సీ ఎస్24 అల్ట్రా రెండూ 12జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీపై రన్ అవుతాయి. గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో ఎక్సోనోస్ 2400 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. గెలాక్సీ ఎస్24 అల్ట్రా టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని, వెనిలా, ప్లస్ మోడల్‌లు అల్యూమినియం ఆర్మర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు..
ఇకపోతే గెలాక్సీ ఎస్24 అల్ట్రా మోడల్ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీతో పాటు 12జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ లేదా 1టీబీ స్టోరేజ్ ఆప్షన్‌లతో రన్ అవుతుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 200ఎంపీ వైడ్-యాంగిల్ కెమెరా, 12ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ టెలిఫోటో కెమెరా, 10తో కూడిన క్వాడ్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉండనుంది. 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో సెన్సార్, ఇందులో 12ఎంపీ సెల్ఫీ షూటర్ ఉండవచ్చు. గెలాక్సీ ఎస్24 అల్ట్రా 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో రానుందని సమాచారం.. ఒక్కో ఫోన్ కు ఒక్కో స్పెషల్ ఫీచర్ ను కలిగి ఉంటాయి.. డజనుకు పైగా భాషలకు సపోర్టుతో రియల్ టైమ్ మెసేజ్‌లను అనువదించే సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చు.. ధర మాత్రం తెలియలేదు..