Site icon NTV Telugu

నెవ్వర్ బిఫోర్.. రూ.29,000 భారీ డిస్కౌంట్ తో Samsung Galaxy S24 FE 5G మొబైల్ అమ్మకాలు..!

Samsung Galaxy S24 Fe 5g

Samsung Galaxy S24 Fe 5g

Samsung Galaxy S24 FE 5G: శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.! ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G మొబైల్ ధర ఇప్పుడు ఊహించని విధంగా భారీగా తగ్గింది. ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫీచర్లు ఉన్న ఈ ‘ఫ్యాన్ ఎడిషన్’ స్మార్ట్‌ఫోన్, లాంచ్ ధర కంటే ఏకంగా రూ.29,000 భారీ డిస్కౌంట్తో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ సేల్స్‌లో దీనిపై అద్భుతమైన డీల్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లభిస్తున్నాయి. దీనితో ఈ మొబైల్‌ను రూ. 35,000 లోపు ధరకే సొంతం చేసుకునే అవకాశం లభించింది. ఈ తగ్గింపుతో మంచి ప్రాసెసర్, అత్యుత్తమ కెమెరా, AI ఫీచర్లను కోరుకునే వారికి S24 FE 5G ఒక అద్భుతమైన ఎంపికగా మారింది.

50MP+50MP+64MP కెమెరాలు, 7200mAh బ్యాటరీ, స్పెషల్ ఫోటోగ్రఫీ కిట్‌తో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ Nubia Z80 Ultra లాంచ్.!

గెలాక్సీ S24 FE 5G ఫోన్ స్పీడ్ అండ్ పెర్ఫార్మన్స్ విషయంలో రాజీ పడలేదు. ఈ మొబైల్ శాంసంగ్ ఎక్సినోస్ 2400e (4 nm) పవర్‌ఫుల్ డెకా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది గేమింగ్‌కు, మల్టీటాస్కింగ్‌కు అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది. ఈ గెలాక్సీ S24 సిరీస్‌లో పరిచయం చేయబడిన గెలాక్సీ AI ఫీచర్లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. ఇందులో ముఖ్యంగా సర్కిల్ టు సెర్చ్ (Circle to Search), లైవ్ ట్రాన్స్‌లేట్ (Live Translate) వంటి విప్లవాత్మక ఫీచర్లు ఉన్నాయి. ఈ AI ఫీచర్లు మీ రోజువారీ పనులను మరింత సులభతరం చేస్తాయి.

CM Chandrababu: పెట్టుబడులే లక్ష్యంగా దుబాయ్ చేరుకున్న సీఎం..!

ఈ మొబైల్ మరో ప్రధాన ఆకర్షణ దాని డిస్‌ప్లే, కెమెరాలు. ఇది 6.7 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే తో వస్తూ.. 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి ఈ డిస్‌ప్లే అత్యంత ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP + 12MP + 8MP కెమెరాలు ఉన్నాయి. ముందువైపు 10MP కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్ IP68 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.

Exit mobile version