NTV Telugu Site icon

Samsung Galaxy M52: అద్భుత ఆఫర్.. ఆ స్మార్ట్‌ఫోన్‌పై 30 శాతం ధర తగ్గింపు..

Samsung Galaxy M52 Smartphone

Samsung Galaxy M52 Smartphone

భారత్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్.. శాంసంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ ధరను పరిమిత కాల ఆఫర్ కింద 30 శాతానికి పైగా తగ్గించింది. శాంసంగ్ ఈ ఫోన్ గతేడాది లాంచ్‌ చేసినప్పుడు ప్రారంభ ధర రూ. 29,999 కాగా.. ఇప్పుడు ఆ ధరపై దాదాపు రూ. 9వేల వరకు తగ్గించింది. ఈ పరిమిత కాల ఆఫర్ రిలయన్స్ డిజిటల్ ద్వారా మాత్రమే వర్తిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరాలతో సహా పలు ఫీచర్లను అందిస్తుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ ఆక్టా-కోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

శాంసంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ లాంచ్‌ చేసినప్పుడు ప్రారంభ ధర రూ. 29,999 కాగా.. ఆఫర్ కింద 9వేలు తగ్గిస్తే రూ.20,999 కి రానుంది. పరిమిత-కాల ఆఫర్ కింద రిలయన్స్ డిజిటల్ ద్వారా మాత్రమే తగ్గింపు ధర వర్తిస్తుంది. అయితే, డిస్కౌంట్ ఏ కాలంలో లభిస్తుందనే దానిపై ఖచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

రిలయన్స్ డిజిటల్ కూడా సిటీ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా శాంసంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ కొనుగోలు చేసే కస్టమర్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అక్కడ కూడా ఇండస్ ఇండ్‌ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై 1,500 క్యాష్‌బ్యాక్ వస్తోంది. ఇవ్వబడిన తగ్గింపు రిలయన్స్ డిజిటల్‌కే పరిమితం కావడం గమనించడం ముఖ్యం. అయితే, అమెజాన్, సామ్‌సంగ్ ఇండియా వెబ్‌సైట్లలో ధర రూ. 24,999గా ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం52 5జీ గత ఏడాది సెప్టెంబర్‌లో భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది బ్లేజింగ్ బ్లాక్, ఐసీ బ్లూ కలర్స్‌లో వస్తుంది. ఏప్రిల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ దేశంలో ప్రారంభించబడింది. ఈ కొత్త ఫోన్ ప్రారంభ ధర రూ. 26,499గా ఉంది.