NTV Telugu Site icon

Samsung Galaxy F54 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఆఫర్స్ డీటెయిల్స్ ఇవే!

Samsung Galaxy F54 5g

Samsung Galaxy F54 5g

Samsung Galaxy F54 5G Smartphone Sale Starts in Flipkart: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ ‘శాంసంగ్‌’ మరో 5జీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఎఫ్‌ సిరీస్‌లో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ (Samsung Galaxy F54 5G) ఫోన్‌ను తీసుకొచ్చింది. జూన్‌ 6 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కాగా.. నేటి నుంచి ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. రూ. 29,999 ధరతో ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. ప్రీ ఆర్డర్ సమయంలో శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్ రూ. 27,999 ధరకు అందుబాటులో ఉంది. శాంసంగ్‌ వెబ్‌సైట్లో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

Samsung Galaxy F54 5G Price and Offers:
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో నేటి నుంచి కొనుగోలు చేయొచ్చు. పలు బ్యాంక్ కార్డ్‌లపై రూ. 3,000 వరకు తక్షణ తగ్గింపును ఉంది. అన్ని ఆఫర్‌ల తర్వాత ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 27,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మెటోర్ బ్లూ మరియు స్టార్‌డస్ట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో రిలీజ్ అయింది. 8GB RAM మరియు 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

Samsung Galaxy F54 5G Specs:
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్‌ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ 13తో కూడిన వన్‌యూఐ 5.1తో వస్తోంది. ఇందులో ఎగ్జినోస్‌ 1380 ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ ఫోన్ వెనుక డిజైన్ గెలాక్సీ S23 లాగా కనిపిస్తుంది. ఇది ఫ్లాగ్‌షిప్ అనుభూతిని ఇస్తుంది.

Also Read: Electricity Bill: కరెంట్ బిల్ ఎక్కువగా వస్తోందని ఆందోళన చెందుతున్నారా?.. ఈ లైట్‌ ఇంట్లో ఉంటే చాలు!

Samsung Galaxy F54 5G Camera:
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్తో పాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్‌ ఉంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా వస్తుంది.

Samsung Galaxy F54 5G Battery:
శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌54 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. సౌడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ కూడా ఉంది.

Also Read: Gold Price Today: మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు! హైదరాబాద్‌లో తులం ఎంతంటే

Show comments