రూ.15 వేలకే బడ్జెట్ రేంజ్లో పవర్ఫుల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త Samsung Galaxy A17 4G లాంచ్! ధర, ఫీచర్స్ ఇవే..
- రూ.15 వేలకే శాంసంగ్ గెలాక్సీ A17 4G..
- 90Hz AMOLED డిస్ప్లే, Helio G99, 50MP ట్రిపుల్ కెమెరా.
- 5000mAh బ్యాటరీ + 6 ఏళ్ల అప్డేట్లు..
- బడ్జెట్ రేంజ్లో పవర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Galaxy A17 4G: శాంసంగ్ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A17 4Gని జర్మనీలో లాంచ్ చేసింది. ఈ కొత్త 4G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గెలాక్సీ A17 4Gకి IP54 రేటింగ్ లభించింది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌కి ఆరు ఆండ్రాయిడ్ అప్డేట్లు, అలాగే ఆరు ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయని శాంసంగ్ హామీ ఇచ్చింది. దీనికి 5G వేరియంట్ అయిన గెలాక్సీ A17 5G ఆగస్టులో భారతదేశంలో విడుదలైన విషయం తెలిసిందే.
జర్మనీలోని శాంసంగ్ అధికారిక వెబ్సైట్లో కొత్త శాంసంగ్ గెలాక్సీ A17 4G ధర, లభ్యత వివరాలు ఇంకా తెలియజేయలేదు. అయితే, ఓ నివేదిక ప్రకారం ఈ ఫోన్లోని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను KSH 22,400 (రూ. 15,000) ధర నిర్ణయించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో ఆగస్టులో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ A17 5G బేస్ మోడల్ ధర 6GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ. 18,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 23,499 ఉంది.
Also Read
- Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Kodak QLED SE 80 cm: తక్కువ ధరలో QLED అనుభవం.. Kodak స్మార్ట్ టీవీపై రూ. 10 వేల డిస్కౌంట్
- Online Cybersecurity Course: ఫ్రాడ్గాళ్లకు చెక్.. ఈ 150నిమిషాల ఫ్రీ కోర్సు నేర్చుకుంటే మీ జేబు చాలా సేఫ్!
- iPhone 18, iPhone 18 Pro: ఐఫోన్ 18, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పై లీకులు.. డిస్ప్లే, కెమెరా, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు!
Manchu Manoj : 100 కోట్ల “మిరాయ్”..మంచు మనోజ్ కు “డేవిడ్ రెడ్డి” కంగ్రాట్స్
డ్యూయల్ సిమ్ శాంసంగ్ గెలాక్సీ A17 4G ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7పై నడుస్తుంది. దీనికి 6 సంవత్సరాల ప్రధాన OS అప్డేట్లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లో జెమిని లైవ్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. దీని డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.

ఇక కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.3, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, NFC, QZSS, Wi-Fi, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. గెలాక్సీ A17 4Gలో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మొబైల్ బరువు 190 గ్రాములు కాగా, 164.4 x 77.9 x 7.5mmగా దీని కొలతలు ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.
China J-35A: ప్రపంచానికి సవాల్ విసురుతున్న.. చైనా ‘సైలెంట్ కిల్లర్’
ఇక కెమెరా విషయానికొస్తే గెలాక్సీ A17 4Gలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్ల కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంది.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!