Samsung Galaxy A17 4G: శాంసంగ్ తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ A17 4Gని జర్మనీలో లాంచ్ చేసింది. ఈ కొత్త 4G ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ హీలియో G99 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. గెలాక్సీ A17 4Gకి IP54 రేటింగ్ లభించింది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌కి ఆరు ఆండ్రాయిడ్ అప్డేట్‌లు, అలాగే ఆరు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని శాంసంగ్ హామీ ఇచ్చింది. దీనికి 5G వేరియంట్ అయిన గెలాక్సీ A17 5G ఆగస్టులో భారతదేశంలో విడుదలైన విషయం తెలిసిందే.
జర్మనీలోని శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త శాంసంగ్ గెలాక్సీ A17 4G ధర, లభ్యత వివరాలు ఇంకా తెలియజేయలేదు. అయితే, ఓ నివేదిక ప్రకారం ఈ ఫోన్‌లోని 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను KSH 22,400 (రూ. 15,000) ధర నిర్ణయించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో ఆగస్టులో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ A17 5G బేస్ మోడల్ ధర 6GB RAM, 128GB స్టోరేజ్‌తో రూ. 18,999గా ఉంది. అలాగే టాప్ ఎండ్ మోడల్ 8GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 23,499 ఉంది.
Manchu Manoj : 100 కోట్ల “మిరాయ్”..మంచు మనోజ్ కు “డేవిడ్ రెడ్డి” కంగ్రాట్స్
డ్యూయల్ సిమ్ శాంసంగ్ గెలాక్సీ A17 4G ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7పై నడుస్తుంది. దీనికి 6 సంవత్సరాల ప్రధాన OS అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో జెమిని లైవ్, సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక AI ఫీచర్లు ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7 అంగుళాల ఫుల్ HD+ (1,080×2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. దీని డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కలిగి ఉంది.
ఇక కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 5.3, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, NFC, QZSS, Wi-Fi, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. గెలాక్సీ A17 4Gలో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మొబైల్ బరువు 190 గ్రాములు కాగా, 164.4 x 77.9 x 7.5mmగా దీని కొలతలు ఉన్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G99 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 4GB RAM, 128GB స్టోరేజ్ కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు.
China J-35A: ప్రపంచానికి సవాల్ విసురుతున్న.. చైనా ‘సైలెంట్ కిల్లర్’
ఇక కెమెరా విషయానికొస్తే గెలాక్సీ A17 4Gలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ సెన్సార్, 5MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 13MP కెమెరా ఉంది.
