Site icon NTV Telugu

Ryan Dahl: ప్రశ్నార్థకంగా “సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల” భవిష్యత్తు.. NodeJS క్రియేటర్ ర్యాన్ డాల్ కీలక వ్యాఖ్యలు..

Software

Software

Ryan Dahl: AI అభివృద్ధి మొత్తం టెక్ రంగాన్ని మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. క్లాడ్ కోడ్ వంటి కోడింగ్ పనుల్ని ఏఐ సాధారణాలు సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కోడర్ల మాదిరిగానే చక్కబెట్టేస్తున్నాయి. దీంతో భవిష్యత్తులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల పనిని కూడా ఏఐ నిర్వహించేలా పరిస్థితులు వస్తున్నాయి. తాజాగా NodeJS క్రియేటర్, ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ర్యాన్ డాల్ చేసిన వ్యాఖ్యలు, టెక్కీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వర్డ్స్, కమాండ్స్ రాయడానికి బదులుగా కొత్త ఐడియాలు, కాన్సెప్ట్స్, డిజైన్‌లపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని, కోడింగ్ ఏఐ టూల్స్‌కు వదిలేయాలని అన్నారు.

Read Also: ఆఫర్ మళ్లీ దొరకదు భయ్యో.. 55 అంగుళాల Xiaomi FX Pro QLED Ultra HD 4K స్మార్ట్ ఫైర్ టీవీపై రూ.30,000 తగ్గింపు..!

ఎక్స్ పోస్టులో ‘‘ మానవులు కోడ్‌ను రాసే యుగం ముగిసింది’’ అని డాల్ పేర్కొన్నారు. అయితే, పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అవసరం లేకుండా పోతుందని ఆయన చెప్పలేదు. కానీ, ఇకపై కోడ రాయడం ఇంజనీర్ ప్రధాన పని కాదని చెప్పకనే చెబుతున్నారు. సిస్టమ్ ఆర్కటెక్చర్ డిజైన్, ఏఐ రూపొందిని కోడ్ సరిగా ఉందో లేదో రివ్యూ చేయడం, అవుట్‌పుట్ సరిగా ఉందో లేదో చూడటం, క్లిష్టమమైన సాంకేతిక నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఇంజనీర్ల ప్రధాన విధులుగా మారుతాయని ఆయన చెబుతున్నారు.

డాల్ చెప్పినవి ఇప్పటికే వాస్తవ రూపం దాలుస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్‌లు తమ ప్రొడక్షన్ కోడ్‌లో సుమారుగా 30 శాతం AI ద్వారానే రాస్తు్న్నామని ప్రకటించాయి. క్లాడ్ కోడ్ వెనక ఉన్న కోడ్‌లో దాదాపుగా 80 శాతం AI ద్వారానే రూపొందుతోంది. అయితే, ఈ మార్పులు కేవలం కోడింగ్‌కు మాత్రమే పరిమితం కాదని ప్రముఖ ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ (ఏఐ గాడ్‌ఫాదర్) హెచ్చరిస్తున్నారు. 2026 నాటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు పోవచ్చని చెబుతున్నారు. AI చాలా తక్కువ సమయంలోనే పనిని పూర్తి చేసే స్థాయికి చేరుకుందని చెప్పారు. మనుషులకు నెలలు పట్టే ప్రాజెక్టుల్ని ఏఐ కేవలం రోజులు లేదా గంటల్లో పూర్తి చేయగలదని అన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కేవలం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ఆధారపడితే ప్రమాదమని, ఉద్యోగ భవిష్యత్తు కోసం మరింత కొత్త టెక్నాలజీ, మరింత అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version