Site icon NTV Telugu

Cancer Treatment: క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించి నాశనం చేయగల నానోబాట్స్

Untitled Design (6)

Untitled Design (6)

క్యాన్సర్ నివారణలో ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. క్యూర్ చేస్తున్నారు. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించే విధంగా ఏఐ ఆధారిత టూల్స్ పనిచేస్తున్నాయి. అయితే కొరియన్ శాస్త్రవేత్తలు దీనిపై కొత్త ఆవిష్కరణలు చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం.. విప్లమాత్మక పురోగతి కోసం ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్‌ను..చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ లు డెవలప్ చేశారు.

ఈ నానోబాట్స్ ను బాక్టీరియోబాట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చిన్న సైజులో ఉండే రోబోట్స్ గా చెప్పవచ్చు. క్యాన్సర్ పేషెంట్లలో వీటిని ప్రవేశ పెట్టడం ద్వారా.. అవి కణాల లోపలికి వెళ్లి వాటిని పూర్తిగా నాశనం చేస్తాయని సైంటిస్ట్ లు వెల్లడించారు. మోథెరపీ వంటి అధునాతన శస్త్రచికిత్సల్లో నొప్పి, గాయాలు వంటివి లేకుండా చికిత్స చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయంటున్నారు. ఈ నానోబాట్స్ నానో పార్టికల్స్ అండ్ బయో రెస్పాన్సివ్ సెన్సార్లతో కూడి ఉంటాయని తెలిపారు..

నానోబాట్స్‌లోని సూక్ష్మ సాంకేతికత, ఏఐ ఆధారిత ఆల్గారిథమ్స్ కారణంగా అవి శరీరంలోకి ప్రవేశించాక.. రోగుల క్యాన్సర్ కణాలను మాత్రమే నానశనం చేస్తాయని వెల్లడించారు. మిగతా ఆరోగ్య కరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించవని సైంటిస్టులు చెప్పుకొచ్చారు.. ఇటీవలి ల్యాబ్ టెస్టుల్లో జంతువులపై ప్రయోగాలు నిర్వహించామని వారు వెల్లడించారు.. ఈ అతిచిన్న నానోబాట్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సక్సెస్ సాధించామని.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో మరో సాంకేతిక యుగం మొదలవుతుందంటున్నారు సైంటిస్టులు.

Exit mobile version