Reliance’s JioBharat V2 4G phone Features and Specifications: ఇప్పటికే భారతదేశంలో అనేక సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇప్పుడు దేశంలో చౌకైన 4G ఫోన్ ‘జియో భారత్ V2’ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ‘జియో భారత్ V2’ ధర కేవలం రూ.999 మాత్రమే. ‘జియో భారత్ V2’ను రిలీజ్ చేయడం ద్వారా ఈ కంపెనీ 10 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకోనుందని కంపెనీ భావిస్తోంది. 999 రూపాయల ఈ ఫోన్ నెలవారీ ప్లాన్ కూడా చాలా తక్కువకే అందిస్తున్నారు. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్ కోసం కస్టమర్లు కేవలం రూ.123 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
Khushi Kapoor: బికినీలో మైండ్ బ్లాకయ్యే ఖుషీ కపూర్ హాట్ ట్రీట్.. చూశారా?
ఈ ప్లాన్‌లో, కస్టమర్‌లు మొత్తం 14GB డేటా మరియు అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. ఒకవేళ ఏడాదికి రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు దాని ధర రూ.1234గా ఉంటుంది. 250 మిలియన్ల 2G కస్టమర్లను 4Gకి తీసుకురావడానికి ‘జియో భారత్’ను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇతర కంపెనీలు కూడా 4G ఫోన్‌లను తయారు చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. దేశంలో2జీ ఫీచర్ ఫోన్ల స్థానంలో త్వరలో 4జీ భారత్ సిరీస్ మొబైల్‌లు రానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2018లో కూడా కంపెనీ JioPhoneని తీసుకువచ్చిన క్రమంలో ఏకంగా 13 కోట్ల మంది కస్టమర్లను సంపాదించింది.
Jio Bharat
జియో భారత్ వి2లో ప్రత్యేకతలు
జియో భారత్ వి2 4జీ ఫోన్
ఇది పూర్తిగా భారత్‌లోనే తయారైందది.
జియో భారత్ వి2 బరువు 71 గ్రాములు.
HD వాయిస్ కాలింగ్
FM రేడియో
128 GB SD మెమరీ కార్డ్ సపోర్ట్
4.5 సెం.మీ TFT స్క్రీన్
0.3 మెగాపిక్సెల్ కెమెరా
1000mAh బ్యాటరీ
3.5mm హెడ్‌ఫోన్ జాక్
పవర్ ఫుల్ లౌడ్‌స్పీకర్
పవర్ ఫుల్ టార్చ్
JioCinema సబ్‌స్క్రిప్షన్‌తో పాటు Jio-Saavn 80 మిలియన్ పాటలకు యాక్సెస్ పొందుతారు.
Jio-Pay ద్వారా UPI లావాదేవీలు చేయచ్చు
Jio Bharat V2 22 భారతీయ భాషలలో పని చేస్తుంది
ఇక ‘జియో భారత్ V2’ బీటా ట్రయల్‌ను జూలై 7 నుంచి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.