రిలయన్స్ జియో ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది.. ఆ సంస్థ ఇచ్చే ఆఫర్లను తట్టుకోవడం కూడా ప్రత్యర్థులకు కష్టంగా మారతుంది.. ఇప్పుడు పండుగ సమయంలో మూడు జియోఫైబర్ ప్లాన్‌లను విడుదల చేసింది.. ఆఫర్ ప్రయోజనాలను పొందేందుకు, వినియోగదారులు కొత్త కనెక్షన్‌ని కొనుగోలు చేసి, రూ. 599 మరియు రూ. 899 ప్లాన్‌లలో ఒకదానికి 6 నెలల పాటు సభ్యత్వాన్ని పొందాల్సి ఉంటుంది… ఈ ఆఫర్ అక్టోబర్ 18వ తేదీ నుంచి 28 మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ప్రయోజనాలను పొందేందుకు, వినియోగదారులు కొత్త కనెక్షన్‌ని తీసుకుని రెండు ప్లాన్‌లలో ఒకదానికి సభ్యత్వాన్ని పొందాలి.
రూ.599 మరియు రూ.899 ప్లాన్‌లలో 6 నెలల పాటు సబ్‌స్క్రయిబ్ చేసుకున్న కస్టమర్‌లు 100 శాతం వాల్యూ బ్యాక్ మరియు 15 రోజుల అదనపు వ్యాలిడిటీకి అర్హులు. ఈ రెండు ప్లాన్‌లు కాకుండా రూ. 899 ప్లాన్‌కు 3 నెలల పాటు 100 శాతం వాల్యూ బ్యాక్ ఆఫర్‌కు అర్హత ఉంది.. కానీ 15 రోజుల అదనపు వాలిడిటీ రాదు.. అక్టోబర్ 18 నుండి 28 మధ్య జియోఫైబర్ ప్లాన్‌లు మరియు కొత్త కనెక్షన్‌ల విషయానికి వస్తే వినియోగదారులకు రూ.6,500 విలువైన ప్రయోజనాలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రెండు ప్లాన్‌లలో కస్టమర్లు ఆనందించగల ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి..
కొత్త కస్టమర్లు జియోఫైబర్ రూ.599 ప్లాన్‌ను ఆరునెలల పాటు తీసుకుంటే ఓచర్ల రూపంలో రూ.4,500 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు అని జియో ప్రకటించింది.. రూ.1000 విలువైన AJIO ఓచర్, రూ.1000 విలువైన రిలయన్స్ డిజిటల్ ఓచర్, రూ.1000 విలువైన నెట్‌మెడ్స్ ఓచర్, ఇక్సిగో (ixigo) రూ.1,000 ఓచర్ అందిస్తుంది ఆ సంస్థ… వాటితో పాటు ఆరునెలలకు అదనంగా 15 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. జీఎస్‌టీతో కలిపి ఈ ప్లాన్ ఆరు నెలలకు రూ.4,241 (రూ.3,594+ రూ.647) ఖర్చవుతుంది. ఈ ప్లాన్‌తో 30ఎంబీపీఎస్ వేగంతో డేటా వస్తుంది. 14 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయని ప్రకటించింది.. ఇక, జియోఫైబర్ రూ.899 ప్లాన్‌ను ఆరునెలల పాటు ఎంపిక చేసుకునే కొత్త కస్టమర్లు బొనాంజా ఫెస్టివల్ ఆఫర్ కింద రూ.6,500 విలువైన ఓచర్లు దక్కించుకునే వీలుంది.. రూ.2,000 విలువైన AJIO, రిలయన్స్ డిజిటల్‌కు చెందిన రూ.1,000 ఓచర్, నెట్‌మెండ్స్ రూ.500 విలువైన ఓచర్, రూ.3,000 విలువైన ఇక్సిగో ఓచర్‌ను పొందవచ్చు. 15 రోజుల అదనపు వ్యాలిడిటీ దక్కుతుంది. రూ.899 ప్లాన్‌ను ఆరు నెలల పాటు తీసుకోవాలంటే జీఎస్‌టీతో కలిపి రూ.6,365 అవుతుందన్నమాట.. మొత్తంగా దీపావళి వేల అదిరిపోయే ఆఫర్లు తీసుకొచ్చింది జియో..