Site icon NTV Telugu

పవర్, స్టైల్, పెర్ఫార్మెన్స్తో జనవరి 29న చైనాలో REDMI Turbo 5 సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇలా..!

Redmi Turbo

Redmi Turbo

REDMI Turbo 5 Series launch: షియోమీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పటికే టీజర్లతో హైప్ క్రియేట్ చేసిన షావోమీ, ఇప్పుడు అధికారికంగా రెడ్ మీ టర్బో 5 (REDMI Turbo 5) సిరీస్ ను జనవరి 29న చైనాలో లాంచ్ చేయనున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ సిరీస్‌లో రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ (REDMI Turbo 5 Max) లాంచ్ కానుంది. ఎందుకంటే ఇది కొత్తగా పరిచయం అవుతున్న మీడియాటెక్ డిమెంసిటీ 9500s ప్రాసెసర్‌తో లాంచ్ అయ్యే తొలి స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది.

Rashmika : ఐటెం సాంగ్ విషయంలో డైరెక్టర్లకు షాక్ ఇచ్చిన రష్మిక మందన్న..

రెడ్ మీ టర్బో 5 మ్యాక్స్ లో షియోమీ ఇప్పటివరకు ఎప్పుడూ ఇవ్వని భారీ 9000mAh బ్యాటరీని అందిస్తోంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ (PPS సపోర్ట్‌తో)తో పాటు 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ను కూడా సపోర్ట్ చేస్తుంది. డిజైన్ పరంగా కూడా REDMI Turbo 5 Max ప్రత్యేకంగా ఉండనుంది. ఎలిగెంట్ లార్జ్ రౌండెడ్ కార్నర్స్, అల్ట్రా-న్యారో బెజెల్స్, CNC మెటల్ ఫ్రేమ్, ఫ్లాగ్‌షిప్ ఫైబర్‌గ్లాస్ రియర్ ఫినిష్, మెటల్ రేస్‌ట్రాక్ షేప్ డెకో, డబుల్ రింగ్ టర్బైన్ లైట్ స్ట్రిప్ ఉండనున్నాయి.

ఈ ఫోన్ కొత్తగా సీ బ్రీజ్ బ్లూ (Sea Breeze Blue) కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పవర్ ఇచ్చే MediaTek Dimensity 9500s SoCను TSMC యొక్క N3E ప్రాసెస్ తో తయారు చేశారు. గ్రాఫిక్స్ కోసం Mali Immortalis-G925 MC12 GPUను అందించారు. ఇది హైఎండ్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అనువుగా ఉండనుంది.

Governor Jishnu Dev Varma: పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా అడుగులు..!

ఈ ఈవెంట్‌లో రెడీమి బడ్స్ 8 ప్రోను కూడా లాంచ్. ఇందులో డ్యూయల్ 6.7mm పీజోఎలక్ట్రిక్ సెరామిక్ డ్రైవర్స్, 11mm టైటానియం-ప్లేటెడ్ డైనమిక్ డ్రైవర్, Xiaomi స్వంత MIHC కోడెక్, LHDC-V5 సపోర్ట్ ఉండనున్నాయి. అంతేకాదు, 55dB, 5kHz అల్ట్రా-వైడ్‌బ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్తో సగటున 28dB నాయిస్ తగ్గింపును అందిస్తుంది. పర్యావరణాన్ని బట్టి స్వయంచాలకంగా అడ్జస్ట్ అయ్యే అడాప్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

ఈ లాంచ్ లో ప్రత్యేకంగా హ్యారీ పోట్టర్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రెడ్ మీ ప్యాడ్ 2 ప్రో హ్యారి పోటర్ ఎడిషన్ Redmi Pad 2 Pro Harry Potter Editionను కూడా షావోమీ లాంచ్ చేయనుంది. ఇందులో హాగ్వార్ట్స్ స్కూల్ బ్యాడ్జ్ ఎంగ్రేవింగ్, డీప్ కస్టమైజేషన్ థీమ్, మాజికల్ స్కూల్-స్టైల్ స్టోరేజ్ బ్యాగ్ ఉండనున్నాయి.

Exit mobile version