10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్‌గ్రేడ్‌లు.!

Redmi Note 17 Series

Redmi Note 17 Series

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రెడ్మీ నోట్ (Redmi Note) సిరీస్ మరో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతోంది. రెడ్మీ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నోట్ సిరీస్‌లో భాగంగా రెడ్మీ నోట్ 17 సిరీస్‌ను జూలై నెలాఖరులో విడుదల చేయనున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. డిస్‌ప్లే, డ్యూరబిలిటీ, బ్యాటరీ సామర్థ్యం వంటి కీలక అంశాల్లో భారీ అప్‌గ్రేడ్‌లతో సిరీస్ రానుంది.

మూడు మోడళ్లతో నోట్ 17 సిరీస్:

ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 17, నోట్ 17 ప్రో, నోట్ 17 ప్రో మాక్స్ అనే మూడు మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రారంభంగా చైనా మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉండగా.. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లలో కూడా విడుదల కానుంది.

రెడ్మీ నోట్ 17:

రెడ్మీ నోట్ 17లో 6.83 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే, 1.5K రిజల్యూషన్‌తో అందించనున్నట్లు సమాచారం. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 67W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. రోజువారీ వినియోగానికి అవసరమైన పనితీరు, మంచి డిస్‌ప్లే అనుభవాన్ని ఈ మోడల్ ను అంచనా వేయవచ్చు.

రెడ్మీ నోట్ 17 ప్రో:

నోట్ 17 ప్రో మోడల్ మరింత అప్గ్రేడ్ స్పెసిఫికేషన్లతో రానుందని లీక్స్ చెబుతున్నాయి. ఇందులో 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్, భారీ 9000mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. అలాగే 50MP ప్రైమరీ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు, పూర్తి వాటర్ రెసిస్టెంట్ డిజైన్ వంటి ఫీచర్లు కూడా అందించనున్నట్లు సమాచారం.

ప్రో మాక్స్‌లో 10100mAh బ్యాటరీ, 200MP కెమెరా?

ఈ సిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ రానుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7500 ప్రాసెసర్‌తో రానున్న ఈ ఫోన్‌లో 10100mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ఇది నిజమైతే రెడ్మీ చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌గా నిలవనుంది. అంతేకాకుండా 200MP మెయిన్ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు, పూర్తి వాటర్ రెసిస్టెంట్ డిజైన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వివరాలు ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న లీకులు, రూమర్ల ఆధారంగానే ఉన్నాయి. అధికారిక లాంచ్ అనంతరం మాత్రమే ఖచ్చితమైన స్పెసిఫికేషన్లు, ధరలకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. అయితే లాంచ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రెడ్మీ, షియోమి సంస్థలు త్వరలోనే అధికారిక టీజర్లు విడుదల చేసే అవకాశం ఉంది.