Site icon NTV Telugu

ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

Redmi Note 15 Se 5g

Redmi Note 15 Se 5g

Redmi Note 15 SE 5G: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం షియోమీ (Xiomi) భారత మార్కెట్లో కొత్త Redmi Note 15 5G Special Edition (SE) ను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ ప్రధానంగా ఔటర్ లుక్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ మొబైల్ మూడు రకాల ఆకర్షణీయమైన వేరియంట్లు ఉన్నాయి.

First Ramayana Movie: వెండి తెరపై తొలి రాముడు.. తొలి సీత ఎవరో తెలుసా? 109 ఏళ్ల నాటి అరుదైన ‘రామాయణ’ విశేషాలు ఇవే!

ఇందులో క్రిమ్సన్ రిజర్వ్ (Crimson Reserve) అనే వేరియంట్ ఇది ప్రీమియం లెదర్ ఫినిషింగ్‌ తో ముదురు ఎరుపు రంగులో లభిస్తుంది. వీటితోపాటు గోల్డ్ కలర్ మిడ్-ఫ్రేమ్ ఫోన్‌కు మరింత హై ఎండ్ లుక్‌ ను ఇస్తుంది. అలాగే క్లాసిక్ లుక్ ఇష్టపడే వారి కోసం మార్బుల్ ఫినిషింగ్‌తో కూడిన ‘ఫ్రాస్టెడ్ వైట్’ & స్టైలిష్ ‘కార్బన్ బ్లాక్’ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 7.35mm మందం కలిగి ఉండి, మిలిటరీ గ్రేడ్ మన్నికతో (MIL-STD-810H) పాటు IP65 + IP66 రేటింగ్స్ తో వస్తోంది.

సాధారణ మోడల్‌తో పోలిస్తే ఈ స్పెషల్ ఎడిషన్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి. ఈ మొబైల్ డిస్‌ప్లే 6.77 అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3200 nits బ్రైట్‌నెస్‌ ను సపోర్ట్ చేస్తుంది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 6 Gen 3 (4nm) ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఇక మొబైల్ వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా (లైట్ ఫ్యూజన్ 400 సెన్సార్), 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో 20MP కెమెరాను అమర్చారు.

Redmi Note 15 5G Special Edition (SE) మొబైల్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత షియోమీ HyperOS 2 పై రన్ అవుతుంది. ఇక ఇందులో 5800mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. మెరుగైన శబ్ద నాణ్యత కోసం డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లను అందించారు. వీటితోపాటు Wi-Fi 6, బ్లూటూత్ 5.1, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రూల్స్ బ్రేక్ చేసిన Abhishek Sharma.. భారీ జరిమానాతో పాటు ఖాతాలో డీమెరిట్ పాయింట్!

ఇక ధర విషయానికి వస్తే.. 6GB + 128GB రూ. 19,999, 8GB + 128GB రూ. 21,999, 8GB + 256GB రూ. 22,999 గా ఉన్నాయి. ఇక ఈ మొబ్బిలే ఏప్రిల్ 7వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్ (Flipkart), Mi.com & రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కలదు.

Exit mobile version