Redmi Note 13 5G Series : మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్.. ధర, ఫీచర్స్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ రెడ్ మీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో అదిరిపోయే మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.. తాజాగా కొత్త ఏడాదిలో కూడా అదిరిపోయే ఫీచర్స్ తో మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయబోతుంది.. రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ కానుందని గతంలో ధృవీకరించింది.. ఈ ఫోన్ ఫీచర్స్ లాంచ్ కు ముందే ఆన్లైన్లో లీక్ అయ్యాయి.. కొత్త ఏడాదిలో భారత్‌లో కంపెనీ నుంచి రాబోయే మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. ఇంతకుముందు చైనాలో లాంచ్ అయిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ రెడ్‌మి నోట్ 13 5జీ, రెడ్‌మి నోట్ 13 ప్రో 5జీ, రెడ్‌మి నోట్ 13ప్రో + 5జీ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది..
ఫీచర్స్ విషయానికొస్తే.. రెడ్‌మి నోట్ 13 5జీ సిరీస్ భారతీయ, గ్లోబల్ వేరియంట్‌ల కోసం పూర్తి స్పెషిఫికేషన్లను షేర్ చేశారు. రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ వనిల్లా వేరియంట్ 2400*1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని లీక్ అయిన స్పెసిఫికేషన్‌లు సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 240హెచ్‌జెడ్ వరకు టచ్ శాంప్లింగ్ రేట్‌తో రానుందని తెలుస్తుంది.. 108ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపీ మాక్రో సెన్సార్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు..
Also Read
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ఇక ఈ నోట్ 13ప్రో 5జీ 4ఎన్ఎమ్ ప్రాసెస్ ఆధారంగా గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం అడ్రినో 710 జీపీయూ ఆధారంగా స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుండగా,నోట్ 13 ప్రో ప్లస్ 5జీ మాలి-జీ610 ఎంసీ4 జీపీయూతో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్‌తో అందిస్తుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్ వేరియంట్‌లలో 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వెరియంట్లలో రాబోతుందని తెలుస్తుంది.
ధర విషయానికొస్తే.. ఈ రెడ్‌మి నోట్ 13 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 20,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 22,999, రూ. 24,9299 ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ అందిస్తుంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ ప్రిజం గోల్డ్, ఆర్కిటిక్ వైట్, స్టెల్త్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.. మరో రెండు రోజుల్లో ఈ మొబైల్స్ మార్కెట్ లోకి రానున్నాయి..
తాజావార్తలు
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!